COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vegetable Khichdi Recipe In Telugu: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో ఇష్టమైన రెసిపీల్లో వెజిటేబుల్స్ కిచిడి ఒకటి.. కిచిడి అనేది ఒక పురాతనమైన రెసిపీ.. దాదాపు ఇది 200 ఏళ్ల నుంచి వస్తోందని సమాచారం. అప్పట్లో నవాబులు కూడా ఎక్కువగా వెజిటేబుల్ కిచిడీ తినేవారట. వెజిటేబుల్ కిచిడి పై నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందట. అందుకే ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో దీనిని స్పెషల్ డిష్ గా కూడా విక్రయిస్తున్నారు. వెజిటేబుల్స్ కిచిడీతో చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే చాలామందికి ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలియకపోవడం వల్ల రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకొని మరీ తింటారు. నిజానికి ఈ వెజిటేబుల్స్ కిచిడీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కిచిడిని తయారు చేసుకోవడం ఎలాగో? కావలసిన పదార్థాలు ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


కావలసిన పదార్థాలు:
అన్నం - 1 కప్పు
పెసరపప్పు - 1/2 కప్పు
నీరు - అవసరమైనంత
తోటకూర లేదా పాలకూర - కొద్దిగా
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
కూరగాయలు (క్యారెట్, బీన్స్, బఠానీలు, కుమ్మడికాయ మొదలైనవి) - 1 కప్పు
ఉల్లిపాయ - 1
ఎండు మిరపకాయలు - 2-3
కరివేపాకు - కొన్ని రెమ్మలు
పసుపు పొడి - 1/4 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కారం పొడి - రుచికి తగినంత
కొత్తిమీర - కొద్దిగా


తయారీ విధానం:
ఈ వెజిటేబుల్ కిచిడీని తయారు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పును కడిగి దాదాపు 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత కూరగాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
ఇదే పోపులో ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. 
బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన పప్పు వేసుకొని మరికొద్దిసేపు అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోండి. 
బాగా వేగిన తర్వాత పసుపు పొడి, కారం పొడి, ఉప్పు వేసి కలపండి. ఆ తర్వాత ఇందులోనే రైస్ వేసుకొని తగినంత నీటిని పోసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 
కిచిడీని ఆవిరి మీద బాగా ఉడికిస్తూ అన్నం ముత్యం ముత్యాలు అయ్యేంతవరకు సన్నని ఫ్లేమ్ లో ఉడికించుకోండి. 
అన్నం బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పైనుంచి వేసుకొని మరోసారి కాస్త కలుపుకొని తక్కువ ఫ్లేమ్ లో మరో 5 మినిట్స్ ఉడికించుకోండి. అంతే సులభంగా వెజిటేబుల్ కిచిడీ రెడీ అయినట్లే..


Also Read: Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?


చిట్కాలు: 
ఈ వెజిటేబుల్ కిచిడీ తయారు చేసుకోవడానికి ఎలాంటి కూరగాయలైన వినియోగించవచ్చు. ముఖ్యంగా ఇందులో క్యారెట్ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 
ఈ వెజిటేబుల్ కిచిడీని బౌల్స్ లో కంటే కుక్కర్లో వండుకోవడం వల్ల మంచి ఆరోమాను పొందుతారు. 
వెజిటేబుల్ కిచిడీని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకుంటే దాదాపు రెండు నుంచి మూడు రోజుల వరకు సర్వ్ చేసుకుని తినొచ్చు.


Also Read: Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.