COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vinayaka Chavithi Special Sugar-Free Naivedyam: దేశవ్యాప్తంగా ఇప్పటికే గణేష్ పండగ వేడుకలు ప్రారంభమయ్యాయి. గణేశోత్సవాలకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. గణేష్ చతుర్థి రోజున భక్తులంతా ఉపవాసాలు పాటించి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో చతుర్థి రోజు చక్కెర తయారు చేసిన ఆహార పదార్థాలు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కానీ స్వామివారికి పెట్టిన చక్కెర కలిగిన నైవేద్యాలు మధుమేహంతో బాధపడుతున్నవారు తినడం హానికరం..కాబట్టి వీరి కోసం ఈ రోజు మేము షుగర్ ఫ్రీ స్వీట్‌లను పరిచయం చేయబోతున్నాం. వీటిని స్వామివారికి నైవేద్యం పెట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా సులభంగా తినొచ్చు. 


షుగర్ ఫ్రీ పాయసం రెసిపీ:
పాయసం రెసిపీని పాలను మరిగించి తయారు చేస్తారు. ఇందులోనే బియ్యం పిండితో తయారు చేసిన సేమియాలను కూడా వేస్తారు. అయితే ఈ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా దీనిని పురాతణ కాలం నుంచి గణేషుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ షుగర్ ఫ్రీ పాయసం రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  


పాయసం రెసిపీ కావలసిన పదార్థాలు:
పాలు
బియ్యం 
పిస్తా 
రోజ్ ఎసెన్స్
బాదం 
చిన్న ఏలకులు 
కృత్రిమ స్వీటెనర్ 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


పాయసం రెసిపీ తయారి విధానం:
ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని పిండిలా తయారు చేసుకుని వేడి నీటితో రోటీ పిండి లాగా నానబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న సేమియా లాగా తయారు చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని పాన్‌లో పాలు మరిగించాలి. ఇందులోనే పిడితో తయారు చేసిన సేమియాను వేసి బాగా మరిగించాలి. ఇలా 24 నుంచి 28 నిమిషాల పాటు మరిగిన తర్వాత మిగిన పదార్థాలను మిక్సీ పట్టుకుని మరిగే పాయసంలో కలుపుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే సులభంగా షుగర్ ఫ్రీ పాయసం రెసిపీ రెడీ అయినట్లే..


షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ రెసిపీ:
దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఆల్మండ్ బర్ఫీలను వినాయకుడి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది హెల్తీ స్వీటే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ హెల్తీ స్వీట్ షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ రెసిపీను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


బర్ఫీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
పాలతో తయారు చేసిన మావా 
బాదంపప్పులు
డ్రై ఫ్రూట్స్ (వాల్‌నట్‌లు, పిస్తాలు మరియు అత్తి పండ్లను)
యాలకుల పొడి
జాజికాయ పొడి


బాదం బర్ఫీని తయారు చేసే విధానం:
బాదం బర్ఫీని తయారు చేయడానికి ముందుగా పాన్‌లో మావాను వేసి మెత్తగా అయ్యే వరకుగా వేడి చేయాల్సి ఉంటుంది. దీనిని బాగా కలుపుతూ మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మిక్స్డ్ నట్స్, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లేట్‌పై నెయ్యి రాసి..తయారు చేసిన మిశ్రమాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమానంగా ప్లేట్‌లో పరుచుకుని ఆరిన తర్వాత ముక్కల్లా కట్‌ చేసుకోవాలి. అంతే సులభంగా బాదం బర్ఫీ రెడీ అయినట్లే..


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook