Walnuts For Diabetes Weight Loss: వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఆరోగ్యమైన ఫైబర్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. ఇది చూడడానికి మనిషి బ్రెయిన్ ఆకారంలో ఉన్నప్పటికీ శరీరానికి చాలా రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఆధునిక జీవన శైలి కారణంగా జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ డ్రై ఫ్రూట్స్ మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా వాల్నట్స్ను క్రమం తప్పకుండా తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా గుండె సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాల్నట్స్ ఇవన్నీ ఉంటాయి:
వాల్నట్స్లో శరీరానికి కావాల్సిన కణజాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం ఐరన్ ప్రోటీన్ మెగ్నీషియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మినరల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఈ డ్రైఫ్రూట్స్ ను నీటిలో మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుని తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. మీ నానబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
ప్రతిరోజు రాత్రంతా నానబెట్టిన ఉదయం పూట నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి:
మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా నీటిలో నానబెట్టిన ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ పరిమాణం అధికంగా పెరుగుతుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.


రక్తంలోని చక్కర పరిమాణం పై ప్రభావం:
ఆధునిక జీవన శైలి కారణంగా మధుమేహం వ్యాధి ఓ సాధారణ వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో లేకపోవడం వల్ల మధుమేహం తీవ్ర రూపంగా దాల్చుతోంది. దీంతో చాలామందిలో ఇది ప్రాణాంతకంగా మారుతోంది. అయితే రక్తంలోని చక్కర పరిమాణంలో నియంత్రించుకోవడానికి నీటిలో నానబెట్టిన వాల్ నట్స్ ను ప్రతిరోజు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్‌ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్‌ వీడియో..


Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook