watermelon Seeds Oil Mask: ఎండకాలం పుచ్చకాయలు మార్కెట్లో విపరీతంగా విక్రయిస్తారు. దాహాన్ని తీర్చుకోవడానికి వీటిని కొనుగోళ్లు చేస్తాం. అయితే, పుచ్చకాయను తినేటప్పుడు అందులోని గింజలు పారేస్తాం. అయితే, ఇందులో కూడా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. కానీ, పుచ్చగింజలతో హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? దీంతో మీ కురులు మెరిసిపోతాయి. అందంగా కనిపిస్తాయి. పుచ్చగింజల్లో ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును కుదుళ్ల నుంచి ఆరోగ్యవంతంగా చేస్తాయి. పుచ్చగింజల్లో జింక్, మెగ్నీషియం, పొటాషియం ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కుదుళ్లకు అవసరం అని అంతర్జాతీయ జర్నల్ అయిన ఫుడ్ అండ్‌ న్యూట్రిషనల్‌ సైన్స్‌ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాయిశ్చర్..
పుచ్చకాయ గింజలతో తయారు చేసిన నూనె మన జుట్టుకు అప్లై చేసుకుంటే రోజంతా హైడ్రేషన్‌ అందిస్తుంది. ఇది జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. అంతేకాదు జుట్టు డ్యామేజ్ అవ్వకుండా పునరుజ్జీవనాన్ని అందిస్తుంది.  పుచ్చగింజల్లో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది సహజసిద్ధంగా జుట్టును మృదువుగా, మాయిశ్చర్‌గా మారుస్తుంది.


జుట్టును బలంగా మారుస్తుంది..
పుచ్చగింజల నూనెలో కావాల్సినంత ప్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇందులో లైనోలిక్ యాసిడ్ జుట్టు బ్రేకేజీలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి జుట్టును బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి ప్రేరేపిస్తాయి.


ఇదీ చదవండి: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..


ఫ్రీజ్..
పుచ్చగింజల నూనెలో ఎమల్లియేంట్‌ గుణాలు ఉంటాయి. ఇది జుట్టుకు మంచి పోషణను అందించి ఫ్రిజినెస్‌ తగ్గించడానికి సహాయపడుతుంది. పుచ్చగింజలు మీ జుట్టును స్మూత్‌గా తయారు చేస్తాయి.పుచ్చగింజలతో హెయిర్ మాస్క్ వేసుకుంటే మీ జుట్టు అందంగా మెరుస్తుంది. అంతేకాదు జుట్టు అందం కూడా చూడటానికి మెరుగవుతుంది.


కుదుళ్ల ఆరోగ్యం..
పుచ్చగింజల నూనెతో హెయిర్‌ మాస్క్ వేసుకుంటే ఆరోగ్యకరమైన కుదుళ్లకు సహాయపడుతుంది. హెయిర్ ఫాలికల్స్‌కు పోషణను అందిస్తుంది. పుచ్చగింజలతో జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.


ఇదీ చదవండి: మొండి బొడ్డుకొవ్వుకు చెక్‌ పెట్టే 5 హెల్తీ ఫుడ్స్‌.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..


పుచ్చగింజలతో మాస్క్‌ వేసుకుంటే తలపై ఆయిల్‌ను నివారిస్తుంది. జుట్టు విరగకుండా కాపాడుతుంది. పుచ్చగింజలతో హెయిర్‌ మాస్క్‌ కూడా వేసుకోవచ్చు. పుచ్చగింజలను గ్రైండ్‌ చేసి అందులో పెరుగు, కలబంద వేసుకుని బాగా మిక్స్‌ చేసి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టుకు వేసుకుని ఓ అరగంట తర్వాత హెయిర్‌ వాష్‌ చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter