Belly Fat Reducing Tips: మొండి బొడ్డుకొవ్వుకు చెక్‌ పెట్టే 5 హెల్తీ ఫుడ్స్‌.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..

Best Foods To Reduce Belly Fat: మొండి బొడ్డుకొవ్వును తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పెద్ద ఛాలెంటజ్. అయితే, ఎక్సర్‌సైజులు చేస్తూ సరైన డైట్‌ అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్‌కు చెక్‌ పెట్టొచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 26, 2024, 02:50 PM IST
Belly Fat Reducing Tips: మొండి బొడ్డుకొవ్వుకు చెక్‌ పెట్టే 5 హెల్తీ ఫుడ్స్‌.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..

Best Foods To Reduce Belly Fat: మొండి బొడ్డుకొవ్వును తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పెద్ద ఛాలెంటజ్. అయితే, ఎక్సర్‌సైజులు చేస్తూ సరైన డైట్‌ అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్‌కు చెక్‌ పెట్టొచ్చు. కొన్ని ఆహారాలు బెల్లీఫ్యాట్‌ ను తగ్గించి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎన్నో రోజులుగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నవారుంటారు. ఈ కాలంలో కూర్చొని ఆఫీసు పనులు ఎక్కువ సమయం పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో బొడ్డుకొవ్వు విపరీతంగా పెరుగతుంది. బెల్లీ ఫ్యాట్‌కు చెక్‌ పెట్టే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

పప్పులు..
పప్పుల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో క్యాలరీలు, కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. ముఖ్యగా పప్పుల్లో లీన్ ప్రొటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. మన బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. వేయించిన లేదా మసాలాలు అధికంగా వేసి వండిన పప్పుల కంటే మాములుగా ఉడకబెట్టిన పప్పు మరింత ఆరోగ్యాన్నిస్తాయి.

బాదం..
బాదంలో కూడా ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. బాదం తినడం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది. బాదంలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బాదం మెటబాలిజం, ఎనర్జీని పెంచుతాయి.

గ్రీన్ వెజిటేబుల్స్..
గ్రీన్ వెజిటేబుల్స్‌లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర, కాలే, ర్యాడిష్, బ్రోకోలీ డైట్లో చేర్చుకుంటే హెల్తీ. ఇవి వాపు సమస్యను తగ్గించి మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఈ కూరగాయలు బెల్లీఫ్యాట్‌ను సులభంగా తగ్గిస్తాయి.

ఇదీ చదవండి: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

చియా సీడ్స్..
చియా సీడ్స్‌ను సాధారణంగా స్మూథీ, బ్రేక్‌ఫాస్ట్‌ లో తీసుకుంటారు. రెండు టేబుల్‌ స్పూన్స్ చియా సీడ్స్‌లో 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్‌ ఉంటుంది. చియా సీడ్స్‌ ముఖ్యంగా గ్లూటెన్ ఫ్రీ, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉంటాయి.

ఇదీ చదవండి: పెరుగుతో మీ ముఖానికి ఈ ఒక్క మాస్క్ వేయండి చాలు.. ఏ క్రీముల అవసరమే ఉండదు..

తృణ ధాన్యాలు..
వీటిలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్స్‌, బ్రౌన్ రైస్, క్వినోవా తీసుకుంటే ఎక్కువ సమయం మన కడుపు నిండిన అనుభూతిని కల్పిస్తాయి. ముఖ్యంగా ఇవి ఇన్ల్ఫమేషన్, ఇన్సూలిన్ రెసిస్టెంట్‌ ను తగ్గిస్తాయి. దీంతో పాటు ఈ తృణ ధాన్యాలను డైట్లో చేర్చుకుంటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News