Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటే.. ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుంది..
Weight Loss Food: ఊబకాయం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు.
Weight Loss Food: ఊబకాయం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే పెరుగుతున్న బరువును నియంత్రించడానికి మార్కెట్ లభించే వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. కానీ వీటి వల్ల ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. ఇలాంటప్పుడు పలు రకాల ఆహార నియమాలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెరుగుతున్న బరువును నియంత్రించేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి పొందడమే కాకుండా వ్యాధుల నుంచి కాపాడుతుంది.
వీటిని ఆహారంగా తీసుకోవాలి:
>>పుట్టగొడుగు ఖరీదైన ఆహార అయినప్పటికీ ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. బరువు తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. జీరో క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గించడమేకాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుచుతుంది.
>>బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిని సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే శరీరానికి చాలా రకాల విటమిన్లు చేకూరుతాయి. ఇందులో జీరో క్యాలరీలు ఉన్నందున.. ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్త పోటును కూడా నియంత్రిస్తుంది.
>> బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా దీనిని 'సూపర్ ఫుడ్' అని కూడా పిలుస్తారు. కావున బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
>> కాలే ఆకులు కూడా శరీర బరువును నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ K, కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కావున శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook