స్థూలకాయం అదుపు చేసి..ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను డైట్ నుంచి తొలగించాలి. ఇందులో ప్రధానంగా ఫ్రూట్స్ ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందా. అవును..ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా..బరువు వేగంగా పెంచుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా చలికాలంలో తగ్గే ఇమ్యూనిటీని పటిష్టం చేసేందుకు వివిధ రకాల ఫ్రూట్స్ తీసుకుంటాం. ఇదే కొంపముంచుతుంటుంది. బరువు వేగంగా పెరిగిపోతుంటారు. ఇటీవలి కాలంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. చలికాలంలో తీసుకునే కొన్ని పదార్ధాలను వెంటనే డైట్ నుంచి తొలగిస్తే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చంటున్నారు. 


బరువు తగ్గేందుకు ఏం చేయాలి


1. వేసవి ప్రారంభమైపోయింది. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల క్రేజ్ పెరిగిపోతుంది. మామిడి అనేది హై కెలోరీ, కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉండే ఫ్రూట్. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అవసరానికి మించి తీసుకుంటే అది మీ బరువుపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ రోగులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి.


2. వేసవి వచ్చేసింది. చాలామంది డైట్‌లో అరటి పండ్లు చేర్చుతున్నారు. అవసరానికి మించి అరటి పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. అరటి పండ్లు రోజుకు 3-4 మాత్రమే తీసుకోవడం మంచిది. అంతకు మించితే శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది.


3. మార్కెట్‌లో ప్రస్తుతం ద్రాక్ష పండ్లు ఎక్కువగా కన్పిస్తున్నాయి. మార్కెట్‌లో లభిస్తున్న ద్రాక్ష ఆరోగ్యానికి మంచివే. ఇవి అధిక కేలరీలవి కావడం వల్ల మోతాదుకు మించి తీసుకోకూడదు. మోతాదు మించి తీసుకుంటే స్థూలకాయం సమస్యగా మారుతుంది.


4. చీకు ఫ్రూట్‌లో ప్రోటీన్లు, ఫాస్పరస్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.ఈ ఫ్రూట్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు తప్పకుండా లభిస్తాయి. కానీ స్థూలకాయం సమస్య ఉన్నవాళ్లు చీకూ పండ్లకు దూరంగా ఉండాలి. 


Also read: Henna Benefits For Hair: మెహందీతో పొడవాటి, మందపాటి జుట్టు 10 రోజుల్లో మీ సొంతం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook