Henna Benefits For Hair: పొడవాటి, మందపాటి, మెరిసే జుట్టు కావాలంటే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జుట్టుకు ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది జుట్టుకు హెన్నాను వినియోగిస్తున్నారు. హెన్నాలో గోరింటకు కలిపి జుట్టు పట్టిస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటి రెండింటిలో ఉండే గుణాలు జుట్టు చాలా రకాల సమస్యలకు దూరం చేయడానికి సహాయపడుతుంది. అయితే వీటిని మిక్స్ చేసి జుట్టు అప్లై చేయడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెహందీ స్కాల్ప్ నుంచి చుండ్రును తొలగిస్తుంది:
హెన్నా సహాయంతో సులభంగా చుండ్రుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు విరగడం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జుట్టులో దురద ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆవాల నూనెలో హెన్నా, మెంతులు వేసి పేస్ట్ సిద్ధం చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. అరగంట తర్వాత షాంపూతో జుట్టును కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు పెరుగుదల వేగవంతంగా మారేందుకు సహాయపడుతుంది.
2. మెహందీ జుట్టు రాలడాన్ని ఆపివేస్తుంది:
హెన్నా సహాయంతో జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఆవాల నూనెలో హెన్నా పౌడర్ కలపాలి. తర్వాత పేస్ట్‌ని సిద్ధం చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టు రంగు కూడా సులభంగా మారుతుంది.
3. పొడి జుట్టు సమస్య నుంచి ఉపశమనం:
హెన్నా సహాయంతో కూడా పొడి జుట్టు నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెహందీలో ఉండే గుణాలు జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. దీని కోసం గోరింట ఆకులను ఉడకబెట్టి అందులో హెన్నా పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా అందులో 2 గుడ్లు వేసి మెత్తగా మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత జుట్టుకు అప్లై చేసి..1 గంట తర్వాత షాంపూ చేయండి. ఇలా చేయడం వల్ల డ్రై హెయిర్‌ని వదిలించుకోవచ్చు.
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook