ఆధునిక జీవనశైలిలో సవాలుగా పరిణిస్తున్న సమస్య అధిక బరువు లేదా స్థూలకాయం. బరువు నియంత్రణలో డైట్ అనేది కీలకభూమిక పోషిస్తుంది. బరువు తగ్గేందుకు ఎలాంటి విధానం అవలంభించాలి, డైట్ ఎలా ఉండాలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక బరువు సమస్యకు చెక్ పెట్టేందుకు లోకార్బ్ , హై ఫైబర్ ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ప్రోటీన్లు, ఫైబర్ ప్రతిరోజూ తప్పకుండా తీసుకోవాలి. అంటే లోకార్బ్, హై ఫైబర్ శరీరానికి చాలా అవసరం. లోకార్బ్ కావడం వల్ల ఆహారంలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గించుకునేందుకు పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండి, తక్కువ కేలరీలుండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..


బరువు తగ్గేందుకు తీసుకోవల్సిన లోకార్బ్ ఆహారం


వీట్‌బ్రాన్


వీట్‌బ్రాన్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కార్బ్స్ పుష్కలంగా ఉంటాయి. వీట్‌బ్రాన్ తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండినట్టు ఉండటమే కాకుండా..ఆకలి కూడా తగ్గుతుంది. 


బెర్రీలు


లోకార్బ్స్ తినాలనుకుంటే..బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు దోహదపడతాయి. అందుకే బెర్రీస్ వినియోగం చాలా మంచిది.


ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్


ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో కార్బ్స్ తక్కువగా ఉంటాయి. ఇక చియా సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చేందుకు దోహదపడుతుంది. 


బ్రోకలీ


బ్రోకలీలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇందులో కార్బ్స్ కూడా తక్కువే. అందుకే బరువు తగ్గించే ప్రక్రియలో బ్రోకలీని డైట్‌లో భాగంగా చేసుకోవాలి.


Also read: Cholesterol: ఈ టిప్స్ పాటిస్తే కొలెస్ట్రాల్ ఎంతెక్కువ ఉన్నా...3 వారాల్లో చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook