Loss Weight in Just 6 Weeks: స్థూలకాయం సమస్యను తగ్గించుకోవటం మన చేతుల్లోనే ఉంది. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలే అధిక బరువుకు ప్రధానమైన కారణమైనందున తగ్గించడం సాధ్యమే. అయితే కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. డైట్ కూడా మార్చాల్సి ఉంటుంది. డైట్ మార్చడంతో పాటు నిర్ణీత సమయంలో వ్యాయామం చేస్తే బరువు తగ్గడం పెద్ద సమస్యేమీ కాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థూలకాయంతో ఎదురయ్యే సమస్యలు


బిజీ జీవితంలో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వంటి చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్డిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం..ఈ కారణాలన్నీ స్థూలకాయానికి దారి తీస్తున్నాయి. స్థూలకాయం కారణంగా తరచూ పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. స్థూలకాయముంటే..గుండె, కిడ్నీ, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్య పొంచి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ బరువు తగ్గించుకోవాలనే ఆలోచన ఉంటుంది. బరువు తగ్గించే క్రమంలో జిమ్, వాకింగ్, డైటింగ్, సైక్లింగ్, యోగా ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొంతమంది భోజనమే మానేస్తుంటారు. ఇంత చేసినా ఫలితాలుండవు. అందుకే డైట్ లో కొన్ని పదార్ధాలు తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది. 


రోజూ పరగడుపున ఏం తినాలి


బొప్పాయి పండుని రోజూ క్రమం తప్పకుండా పరగడుపున తింటే వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా బొప్పాయి తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గేందుకు కీలకంగా మారుతుంది. బొప్పాయి తినడం వల్ల శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ అంటే విష వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. 


రాత్రి పూట నానబెట్టిన మెంతుల్ని ఉదయం పరగడుపున క్రష్ చేసి అదే నీళ్లతో కలిపి తాగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అధిక బరువు సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.


యాపిల్ రోజూ పరగడుపున తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఆపిల్‌లో ఉండే ఫైబర్ సహా ఇతర పోషక పదార్ధాలు బరువు తగ్గించేందుకు దోహదపడతాయి. రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. 


ఇక ప్రతిరోజూ పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. మెటబోలిజం వేగవంతమై అధిక బరువు తగ్గుతుంది.


Also Read: Best Anti Aging Cream: 60 ఏళ్లైన వృద్ధులు కూడా ఇలా 5 రోజుల్లో గ్లోయింగ్ స్కిన్ పొందొచ్చు!


Also Read: Mahesh Babu movie Fees: మహేష్ ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook