Weight Loss Tips: ప్రతి రోజూ ఉదయం పూట తేనెతో కలిపిన నీటిని తాగితే బరువు తగ్గడం ఖాయం..!
Weight Loss With Honey: పురాతన కాలం నుంచి తేనెను ఓ ఔషధ భావిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొన్నారు
Weight Loss With Honey: పురాతన కాలం నుంచి తేనెను ఓ ఔషధ భావిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా రక్షణ కలిపించి.. వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే ఆయుర్వేద నిపుణులు పలు రకాల వ్యాధులకు తేనెను వినియోగించాలని సూచిస్తారు. ఈ తేనె వివిధ రకాల పూల మకరందం నుంచి తయారవుతుంది. కావున ఆహార పదార్ధాలను రుచి చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది దీనిని డైట్‌లో భాగంగా కూడా వినియోగిస్తున్నారు.
క్రమం తప్పకుండా తేనెను తీసుకుంటే మంచిదేనా:
తేనె కూడా చక్కెరలా తీయగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం కూడా తగ్గుతుంది. ఇందులో మెటబాలిక్ సిండ్రోమ్ ఉండడం వల్ల మధుమేహం సమస్యల నుంచి రక్షణ కలిగిస్తుంది.
తేనె వల్ల ప్రయోజనాలు:
1. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
తేనెలో అధిక పరిమాణంలో గ్లూకోజ్ ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. కావున అలసట, నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో వచ్యే చిన్న చిన్న సమస్యల నుంచి దూరం చేస్తుంది.
2. కాలిన గాయాలు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో తేనెలో ఉండే మూలకాలు చర్మంపై కాలిన గాయాలు, ఇన్‌ఫెక్షన్లు, శస్త్రచికిత్స వల్ల కలిగే గాయాలను నయం చేసేందుకు సహాయపడుతుంది.
3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే..శరీర బరువును నియంత్రిస్తాయని డైటీషియన్లు, ఫిట్‌నెస్ నిపుణులు తెలుపుతున్నారు. తేనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీవక్రియను కూడా మెరుగుపరుచుతుంది. కావున వీటిని తగిన మోతాదులో తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook