Weight Loss Yoga: యోగా వల్ల శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పలువురు సూచిస్తుంటారు. శరీరాన్ని ఫిట్ గా, ఫ్లెక్సిబుల్ తో పాటు సరైన్ షేప్ లో ఉంచుకునేందుకు సహాయపడుతుంది. యోగా వల్ల రోగనిరోధక శక్తి మెరుగయ్యి.. అనేక వ్యాధుల నుంచి బయటపడొచ్చు. అయితే యోగాలోని ఓ ఆసనం ద్వారా ఉత్తన్ పాదాసన ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తన్‌ పదాసనం అంటే ఏమిటి?


ఉత్తన్‌పాదాసనలో.. ఉత్తాన్ అంటే పైకి లేవడం, పాద అంటే కాలు. ఈ యోగాసనంలో కాళ్లపాటు శరీరాన్ని పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం. దీన్ని ఉత్తానా పాదాసనం అంటారు. ఈ ఆసనాన్ని ప్రతిరోజూ పాటించడం ద్వారా మీరు అనేక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. 


ఉత్తన్‌పాదాసనం చేసే విధానం..


- తొలుత చదునైన ప్రదేశంలో పడుకోవాలి. 


- ఇప్పుడు రెండు కాలి వేళ్లను ఒకదానితో ఒకటిని దగ్గరగా తీసుకురావాలి. 


- ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ.. మీ కాళ్లను పైకి లేపాలి (ఫోటోలో చూపిన విధంగా). 


- అలా కాళ్లను భూమికి 30 డిగ్రీల కోణం వరకు తీసుకెళ్లి గాల్లో అలానే ఉంచాలి. 


- అలా చేసిన తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ వదలాలి. 


- దాదాపుగా 30 సెకన్ల పాటు అలా చేసిన తర్వాత కాళ్లను మళ్లీ యథా స్థానానికి తీసుకురావాలి. 


ఉత్తన్‌పదాసన ప్రయోజనాలు


1. ఈ ఆసనాన్ని రోజూ అభ్యసించడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 


2. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉపశమనం పొందుతారు.


3. నాభిని బ్యాలెన్స్ చేయడంలో ఈ ఆసనం అత్యంత ముఖ్యమైనది.


4. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట చుట్టూ పెరుకున్న కొవ్వు తగ్గుతుంది.


5. దీని ద్వారా అబ్స్ కూడా తయారు చేసుకోవచ్చు.


6. ఈ ఆసనం ద్వారా వెన్నునొప్పిలో కూడా ఉపశమనం లభిస్తుంది.


ఉత్తన్‌పాదాసనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!


- మీరు పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్న వారైతే ఈ ఆసనాన్ని ట్రై చేయవద్దు. 


- గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఆసనం వేయకూడదు.


- ఈ ఆసనాన్ని ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో చేయాలి. 


- మీకు వెన్నునొప్పి ఉంటే ఈ ఆసనాన్ని చేయకపోవడమే మంచిది. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించినది. దీన్ని ఆచరించే ముందు సంబంధిత యోగా నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Electricity Bill Reducing Tips: 24 గంటలు ఏసీ, కూలర్, ఫ్యాన్ వేసినా.. ఈ టిప్స్ తో సగానికంటే తక్కువ కరెంటు బిల్లు!


Also Read: Wifi Speed Boost: ఈ టిప్స్ పాటిస్తే Wifi ఇంటర్నెట్ స్పీడ్ మామూలుగా పెరగదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.