Gastric Ulcer Causes: ప్రస్తుత ఉన్న బిజీ లైఫ్ కారణంగా అహార అలవాట్లలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.  అయితే ప్రతిఒక్కరిని పీడిస్తున్న సమస్యలో గ్యాస్ట్రిక్ అల్సర్‌ ఒకటి.  ఈ సమస్య ఎంతో తీవ్రమైనదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు అల్సర్‌ ఎందుకు వస్తుంది?


మన జీర్ణవ్యవస్థలో యాసిడ్‌ లెవెల్స్ ఒక పరిమాణంలో అవసరం. కానీ ఒక వేల యాసిడ్‌ స్థాయిలు ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే అల్సర్లు తయారువుతుంది.  అంతేకాకుండా అల్సర్ రావడానికి హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ అల్సర్‌ వస్తుంది.  


అల్సర్‌  రావడానికి గల కారణాలు: 


అల్సర్‌ రావడానికి ముఖ్య కారణం హెలికోబ్యాక్టర్‌ పైలోరి అనే బ్యాక్టీరియా  వల్ల  మన కడుపులో పుండ్లను ఏర్పడతాయి.


➻  అంతేకాకుండా టైమ్‌కు తినకపోవడం వల్ల కూడా  ఈ అల్సర్ బారిన పడాల్సి ఉంటుంది.


అధిక కారం, మసాలాలతో చేసిన వంటలు తీసుకోవడం వల్ల ఈ సమస్య బారిన పడుతుంటారు. 


స్మోకింగ్‌, డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉంటే అల్సర్‌ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు ఉన్న ఈ అల్సర్ బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


Also Read Foods Lead Kidney Stones: కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఇవి తినకూడదు!


అల్సర్‌ నుంచి బయటపడే చిట్కాలు ఇవే: 


ప్రతిరోజు శొంఠి, పిప్పళ్లు , మిరియాలు, జీలకర్ర, ఉసిరికాయ, ఉప్పు పొడి చేసి మజ్జిగతో తీసుకోవడం వల్ల అలర్స్‌ వల్ల కలిగే మంటను తగ్గించవచ్చు. 


ఇనుప గరిటను వేడి చేసి ఇందులో ఒక టీ స్పూన్‌ చక్కెర, జీలకర్ర, అల్లంని మజ్జిగలో మజ్జిగలలో కలిపి తాగడం వల్ల అలర్స్‌ వల్ల కలిగే మంట తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పరగడుపునే తాగాల్సి ఉంటుంది.


సైంధవ లవణం, వెల్లుల్లి రసం, ఇంగువలను లిపి తీసుకోవాలి.  దీని వల్ల కడుపు నొప్పి, మంట తగ్గుతాయని ఆయుర్వేవ నిపుణులు చెబుతున్నారు.


మారేడు గుజ్జు, బెల్లం సమానంగా తీసుకొని మజ్జిగలో కొంచెం తీసుకోవడం వల్ల కడుపునొప్పి తగ్గుతుంది.


కడుపులో పుండ్లు తగ్గడానికి గంజి  నీటిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కలిని తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


వాల్ నట్స్‌, దానిమ్మ పండ్లు తీసుకోవడం వల్ల  అల్సర్‌ సమస్య నుంచి బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు.


Also Read Skin Care Tips: నిత్య యౌవనంగా, అందంగా కన్పించాలంటే ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter