Weight Loss Tips: పోషకాల పుట్ట కీర దోసకాయ.. బరవు తగ్గించడం ఎలా సహాయపడుతుందో తెలుసా..?
Cucumber Weight Loss Tip: వేసవికాలంలో బరవు తగ్గించుకోవాలి అనుకొనేవారు తప్పకుండా మీ డైట్లో కీరదోసకాయను చేరుకోండి. దీని వల్ల మీరు సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Cucumber Weight Loss Tip: వేసవికాలంలో చాలా మంది ఆహారపట్ల ఎన్నో జాగ్రత్తలను పాటిస్తుంటారు. ముఖ్యంగా బరువు విషయంలో ఎంతో ఆచితూచి డైట్ ఫాలో అవుతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం సమ్మర్ లో శరీర కొవ్వును తగ్గించుకోవాడానికి సరైన టైమ్ ఇదే అని చెబుతున్నారు. అయితే ఎండాకాలంలో కొన్ని రకాల ఆహారపదార్థాలు బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతాయి. అందులో కీరదోసకాయ ఒకటి.
కీర దోసకాయలలో బోలెడు లాభాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడంలో ఎంతో సాయపడుతుంది. అయితే ఏ విధంగా ఇది మనకు సహాయపడుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం.
కీర దోసకాయలతో బరువు ఎలా తగ్గవచ్చు?
కీర దోసకాయలో అతి తక్కువ కేలరీలు ఉంటాయి. మీరు ప్రతిరోజు ఒక కప్పు కీర దోసకాయరు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. దీనిని మీరు స్నాక్‌గా లేదా సలాడ్ లో ఉపయోగించవచ్చు. వేసవిలో కీర దోసకాయ తీసుకోవడం చాలా మంచిది. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఇది తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇందులో అధిక శాతం నీరు ఉంటుంది. అలాగే ఆకలి తగ్గుందుకు కూడా సాయపడుతుంది. ఈ కీర దోసకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గవచ్చు. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది.
కీర దోసకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, కె, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా కీరాదోసకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇది వేసవిలో కలిగే మంటను కూడా తగ్గిస్తుంది. మీరు కీర దోసకాయను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడకపోతే మీరు దీని జ్యూస్‌గా తయారు చేసుకొని తినవచ్చు. లేదా కీర దోసకాయ సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కీర దోసకాయ ముక్కలను హమ్మస్ లేదా గ్రీక్ పెరుగుతో డిప్ చేసి తినవచ్చు లేదా కీర దోసకాయ చిప్స్‌ను తయారు చేసుకోవచ్చు.
బరువు తగ్గడం ముఖ్యమైన విషయాలు:
కీర దోసకాయతో పాటు మీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం చాలా అవసరం. కీర దోసకాయలు బరువు తగ్గడానికి సహాయపడే ఆరోగ్యకరమైన రుచికరమైన ఎంపిక. వాటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల మీరు మీ బరువు తగ్గడం లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి