What Is ABC Juice: ఏబీసీ జ్యూస్ తాగితే ఇక మిమ్మల్ని ఆపేదెవ్వరు ?
What Is ABC Juice and How It Helps Your Body : ఎన్నో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా కలగలిసి ఉండే ఈ ఏబీసీ జ్యూస్ ఒక రకంగా ఎనర్జిటిక్ డ్రింక్ తరహాలో పనిచేస్తుంది.. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఇంతకీ ఈ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి ? ఈ ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
What Is ABC Juice and How It Helps Your Body : నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పొద్దున్నే లేవడంతోనే ఎంతో ఎనర్జిటిక్ గా మొదలయ్యో మీ రోజు... రాత్రి పడుకునేటప్పటి వరకు ఆ ఎనర్జి కొనసాగాలి. అలా నెగ్గుకు రావాలంటే ఎంతో ఎనర్జీని ఇచ్చే న్యాచురల్ డ్రింక్స్ ఎంతో అవసరం. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూసా.. ఇంతకీ అదేంటి ఏంటి అంటారా ? మరేం లేదు.. యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ల కలయికే ఈ ABC జ్యూస్. ఎన్నో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా కలగలిసి ఉండే ఈ ఏబీసీ జ్యూస్ ఒక రకంగా ఎనర్జిటిక్ డ్రింక్ తరహాలో పనిచేస్తుంది.. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.
ఈ ఏబీసీ జ్యూస్ ప్రతీ రోజూ ఉదయాన్నే మీ డైలీ రొటీన్ లో ఒక భాగం చేసుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాంటి జబ్బులనైనా తట్టుకునేలా రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు రోజు మొత్తం ఎంతో శక్తితో దూసుకుపోయేందుకు అవసరమైన ఊతం అందిస్తుంది.
ఈ ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
న్యూట్రీయెంట్ పవర్‌హౌస్ : యాపిల్, బీట్‌రూట్, క్యారట్ కలగలిసిన ఏబీసీ జ్యూస్ వల్ల యాపిల్స్‌లోని విటమిన్ A , విటమిన్ C, బీట్‌రూట్‌లోని ఐరన్, పొటాషియం.. అలాగే క్యారెట్‌లోని బీటా-కెరోటిన్, అవసరమైన పోషకాల శక్తివంతమైన కాక్‌టెయిల్‌ను అందిస్తుంది.
ఇన్‌స్టాంట్ ఎనర్జీ బూస్టర్ : యాపిల్స్‌లో సహజంగా ఉండే షుగర్ లెవెల్స్ తక్షణమే శక్తిని అందిస్తాయి. రోజంతా అప్రమత్తంగా ఉండటంతో పాటు చేసే పనిపై ఏకాగ్రత పెరిగేలా చేస్తాయి.
జీర్ణ వ్యవస్థ : యాపిల్స్, క్యారెట్‌లలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బీట్‌రూట్‌తో కాన్‌స్టిపేషన్ సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
రోగనిరోధక శక్తి : యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్‌లో పుష్కలంగా ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థను పెంచి ఇన్‌ఫెక్షన్స్‌ని జబ్బులను దూరం చేస్తుంది.
ఇది కూడా చదవండి : Drinking Water While Eating Food: అన్నం తినే ముందు నీళ్లు తాగితే మంచిదా ? అన్నం తిన్న తరువాత మంచిదా ?
అందమైన నిగారింపు : యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్‌లోని విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తాయి. అవి మీ చర్మంలోని కణాలను యవ్వనంగా, మెరిసేలా చేసి మీ చర్మ సౌందర్యం ఉట్టిపడేలా చేస్తాయి.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.