Coconut oil VS Virgin coconut oil: ఆరోగ్యకరమైన ఆయిల్ ఏదంటే మనం సాధారణంగా ఆలివ్ ఆయిల్ లేదా మరోటి ఆలోచిస్తాం కానీ, మన దేశంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆయిల్ లో కోకోనట్ ఆయిల్ కూడా ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ లో వంటలు కూడా చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా మీడియం చైన్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, మనకు సాధారణంగా కోకోనట్ ఆయిల్ కొనుగోలు చేసేటప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని మార్కెట్లో అందుబాటులో ఉంది దీంతో ఉపయోగాలు ఏంటి? మాములు కొబ్బరి నూనెకు దీనికి మధ్య తేడా ఏంటి అని ఆలోచిస్తాం. అందులో ప్రత్యేకత ఏంటి అని అనుకుంటారు.కొబ్బరి చెట్టు నుండి రకరకాల కొబ్బరి నూనెలు తయారు చేస్తారు కోకోనట్ ఆయిల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా కొబ్బరి చెట్టు నుండే తీస్తారు రెండిటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


కోకోనట్ అనేది కొబ్బరి చెట్టు నుండి తీసి ఒక పండు. ఎండు కొబ్బరి అయిన తర్వాత ఇందులోంచి కొబ్బరి నూనె తీస్తారు. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అయితే వర్జిన్ కోకోనట్ ఆయిల్ విషయానికి వస్తే ఇది కొబ్బరి మీగడ నుంచి తయారు చేస్తారు ఇది కూడా కోల్డ్ ప్రెస్సింగ్ ప్రక్రియలో తయారుచేస్తారు.


మామూలు కొబ్బరి నూనె అయితే రిఫైండ్ చేసి తయారు చేస్తారు. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ లో మంచి సువాసన వెదజల్లుతుంది. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఈ కోకోనట్ ఆయిల్ ను కోల్డ్ ప్రెస్సింగ్ పద్ధతిలో తయారు చేస్తారు దీన్ని వేడి చేసే పద్ధతిలో కెమికల్స్ లేకుండా అవసరం లేని పదార్థాలను బయటకు తీసి తయారు చేస్తారు.


ఇదీ చదవండి: నలుగురిలో కలిసిపోవాలంటే...!


అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేసేటప్పుడు కోల్డ్ ప్రెస్డ్‌, కెమికల్, రీఫైనింగ్ పద్ధతులతో తయారు చేస్తారు. ఈ కోకోనట్ ఆయిల్ లో పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది మామూలు కొబ్బరి నూనె కంటే మరింత ఆరోగ్యకరంఅయితే కొబ్బరి నూనె వర్జిన్ కొబ్బరి నూనెలో కూడా అనేక ఆరోగ్య పోషకాలు రెండిటిలో ఉంటాయి.  ఫైబర్ విటమిన్ సి, విటమిన్ బి ,మినరల్స్ మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తే ఇమ్యూనిటీని పెంచుతాయి.


ఇదీ చదవండి: ఉప్మాతో ఆరోగ్యం


కానీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ లో ఎక్కువగా పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఫాలీ ఫైనాల్స్ ఉంటాయి ఇందులో లారిక్ యాసిడ్ కూడా పోష్కలంగా ఉంటుంది.అంతేకాదు వర్జిన్ కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్ట్ గుణాలు ఉంటాయి.అయితే కోకోనట్ ఆయిల్ మాదిరి వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని కూడా వంటల్లో ఉపయోగిస్తారు రకరకాల కూరలు డెసర్ట్ లో కూడా ఈ ఆయన్ని ఉపయోగిస్తారు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook