White Hair To Black: తెల్ల జుట్టు సమస్యలు, నెరసిపోవడం వంటి సమస్యల కారణంగా చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు తెల్లజుట్టు వయసుతో సంబంధం లేకుండా 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతలో కూడా జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా మారడమేకాకుండా, కొద్ది రోజుల తర్వాత జుట్టు రివర్స్ డ్యామేజ్‌ అవుతుంది. కెమికల్ బేస్డ్ హెయిర్ డైని వినియోగించకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన రంగులను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజువారి అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రే హెయిర్ రాకుండా ఎలా ఆపాలో తెలుసా?:
చిన్న వయసుల్లోనే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి తప్పకుండా చెడు అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగించకుండా సాధరణ మూలికలతో తయారు చేసిన ప్రోడక్ట్స్‌ను వినియోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


1. అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోండి:
చిన్న వయస్సులో ఫాస్ట్, జంక్, స్ట్రీట్ ఫుడ్‌ను అతిగా తినేవారిలో తెల్ల జుట్టు సమస్యలు తొందరగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల ప్రేగు, మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి జుట్టు సమస్యలు రాకుండా ఉండడానికి కేవలం  ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, జింక్, ఐరన్, కాపర్ సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.


Aslo Read: Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!


2. టెన్షన్‌ని తగ్గించుకోండి:
 'ఆందోళన అంత్యక్రియల చితి లాంటిది' కాబట్టి అతిగా టెన్షన్‌ పడడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు ఒత్తిడి కారణంగా చాలా మందిలో శరీర సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అనవసరమైన టెన్షన్ పడకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపడడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు యోగాతో పాటు ధ్యానం చేయాల్సి ఉంటుంది.


3. సిగరెట్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది సిగరెట్లు, మద్యపానానం వంటి చెడు వ్యసనాలకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి అలవాట్లు ఉన్నవారు తప్పకుండా తొందరలోనే మానుకోవాల్సి ఉంటుంది.


4. శారీరకంగా చురుకుగా ఉండండి:
మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయకపోతే రక్తప్రసరణ మందగించి జుట్టు వరకు రక్తప్రసరణ సరిగా జరగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Aslo Read: Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.