First Night and Roses: పెళ్లి అనేది జీవితంలో ఓ మర్చిపోలేని అనుభూతి. విభిన్న దేశాల్లో విభిన్న సాంప్రదాయాల్లో వివిధ రకాలుగా పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ శోభనం రోజు మాత్రం అన్ని ప్రాంతాల్లో ఒకటే దృశ్యం కన్పిస్తుంది. అదేంటి, ఎందుకలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోని వివిధ దేశాల్లో విభిన్న సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఒక్కో మతంలో ఒక్కో రకంగా పెళ్లి ఉంటుంది. అయితే పెళ్లిళ్లలో వైవిద్యం ఉన్నా..శోభనం రోజు మాత్రం ఓ విషయంలో సారూప్యత కన్పిస్తుంది. ఎక్కడ చూసినా ఆ దృశ్యం ఒకటే ఉంటుంది. అది లేకుండా ఎక్కడా ఫస్ట్‌నైట్ సీన్ కన్పించదు. అసలా సీన్ ఎంటి, దాని వెనుకున్న కారణమేంటో తెలుసుకుందాం..


పెళ్లైన తరువాత ఫస్ట్‌నైట్ రోజు బెడ్ రూమ్, బెడ్ రెండూ సర్వాంగ సుందరంగా అలంకరిస్తుంటారు. బెడ్రూమ్, బెడ్ రెండింటా అందంగా పూలతో అలంకరిస్తారు. ముఖ్యంగా బెడ్‌పై తప్పకుండా గులాబీ పూవులు చల్లుతారు. లేదా గులాబీ పూలతోనే బెడ్ అలంకరిస్తారు. ఏ దేశంలో, ఏ సాంప్రదాయంలో పెళ్లి జరిగినా ఫస్ట్‌నైట్‌లో మాత్రం ఈ సీన్ తప్పకుండా కన్పిస్తుంది. గులాబీ పూలు లేకుండా బెడ్ రూమ్ లేదా బెడ్ అలంకరణ ఉండనే ఉండదు. 


గులాబీ పూలకు ఎందుకంత ప్రాధాన్యత


గులాబీ పూలంటే ప్రేమకు చిహ్నంగా నమ్ముతారు. అందుకే వాలంటైన్స్ డే రోజున లేదా ప్రేమికులు ఒకరి భావం మరొకరు చెప్పుకునేందుకు సంకేతంగా గులాబీ పూలే ఎంచుకుంటారు. ఫస్ట్‌నైట్ రోజు భార్యభర్తల మధ్య ప్రేమ చిగురించాలనే ఉద్దేశ్యంతో గులాబీ పూలు బెడ్‌పై నిండుగా చల్లుతారు. మనస్సులో ప్రేమే కాకుండా..శారీరకంగా కోరికను రగిలించడంలో గులాబీలు ప్రేరేపిస్తాయని అంటారు. 


ఇక మరో కారణం గులాబీలు అందానికి, సువాసనకు ప్రతీక. గులాబీలతో అలంకరిస్తే అందంతో పాటు గది నిండా పరిమళం ఉంటుందనే ఉద్దేశ్యంతో గులాబీలు చల్లుతారు. గులాబీల స్పర్శ..భార్యాభర్తల జీవితాన్ని ప్రేమతో నింపుతుందని నమ్ముతారు. గులాబీ పువ్వులు అందం, పరిమళంతో పాటు వాటి పరిమళం ఆరోగ్యానికి మంచిది. ఆ కారణంతో కూడా గులాబీలనే బెడ్‌పై చల్లేందుకు ఎంచుకుంటారు. 


Also read: Skin Care in Summer: ఎండాకాలంలో మెరుగైన్ స్కిన్ టోన్‌కు ఏం చేయాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook