Skin Care in Summer: ఎండాకాలంలో మెరుగైన్ స్కిన్ టోన్‌కు ఏం చేయాలి

Skin Care in Summer: వేసవి పీక్స్ లో ఉంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండల వేడి నుంచి హీట్ వేవ్స్ నుంచి ముఖ సౌందర్యాన్ని, స్కిన్ టోన్ ని సంరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన స్కిన్ టోన్ కోసం ఏం చేయాలి

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2022, 10:04 PM IST
Skin Care in Summer: ఎండాకాలంలో మెరుగైన్ స్కిన్ టోన్‌కు ఏం చేయాలి

Skin Care in Summer: వేసవి పీక్స్ లో ఉంది. ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండల వేడి నుంచి హీట్ వేవ్స్ నుంచి ముఖ సౌందర్యాన్ని, స్కిన్ టోన్ ని సంరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన స్కిన్ టోన్ కోసం ఏం చేయాలి

ఎండాకాలం వచ్చిందంటే ఆరోగ్యపరంగా చాలా సంరక్షణ చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్మం విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త అవసరం. ముఖ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు, స్కిన్ టోన్ పరిరక్షణకు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎండల నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవల్సిన అవసరముంటుంది. సూర్యుని నుంచి నేరుగా వచ్చే అతి నీలలోహిత కిరణాలు కల్గించే హాని నుంచి చర్మాన్ని రక్షించుకోవాలి. అందుకే వేసవి వచ్చిందంటే చాలా సన్‌స్క్రీన్ లోషన్స్ ప్రాధాన్యత పెరిగిపోతుంటుంది. ఇక వేసవిలో చాలామందికి చెమట కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్లెన్సర్ వాడటం మంచిది. అయితే రసాయనాలు లేని క్లెన్సర్ వాడటం మంచిది.

ఇక వేసవి వేడిలో ముఖానికి నూనె లేదా సీరమ్ ఉపయోగించడం ఎంతమాత్రం మంచిది కాదు. వేసవి కారణంగా చెమట, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. నూనె వంటివి రాస్తే..చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. వేసవి కాలంలో సాధ్యమైనంత వరకూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే..అనారోగ్యం కారణంగా చర్మ సమస్యలు వెంటాడుతాయి. బ్లాక్‌హెడ్స్, డ్రై స్కిన్ వంటివి సమస్యలెదురవుతాయి. చర్మం తేమగా ఉండేందుకు వీలుగా మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇక వేసవికాలంలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. నీళ్లు ఎంత ఎక్కువగా తీసుకుంటే చర్మం అంతగా బాగుంటుంది. ఎండలో వెళ్లేటప్పుడు ముఖంపై అలసట, చికాకు లేకుండా ఉండాలంటే టోనర్ తప్పకుండా వాడమంటున్నారు. టోనర్ అనేది చర్మంలో పీహెచ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

వేసవి కాలంలో ఎండల్లోంచి వచ్చిన వెంటనే ముందుగా చల్లని నీళ్లతో ముఖాన్ని నాలుగైదు సార్లు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము ధూళి ముందుగా తొలగిపోతుంది. కంటికి, చర్మానికి తాజాదనం అందుతుంది. 

Also read: Vitamin E Benefits: అందానికి ఆరోగ్యానికి ఒకటే మందు..అదే విటమిన్ ఇ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News