కరోనా వైరస్ ( Corona virus ) రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ తో ప్రమాదమని తెలుసు. లావు అధిక బరువున్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్  పట్ల చిన్నారులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటివరకూ అందరికీ తెలుసు. ఇప్పుడు బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ( oxford university scientists ) చెప్పిన దాని ప్రకారం లావుగా ఉన్నవారు, అధిక బరువు ( Fatty People ) కలిగినవారికి కరోనా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 


లావుగా ఉన్నవారిపై వైరస్ ఎందుకు ప్రమాదకరంగా మారుతుందనే దానిపై సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో చాలా విషయాల్ని కనుగొన్నారు. ఇవీ ఆ కారణాలు…Also read: యోగాతో రోగ నిరోధక శక్తి ఎలా మెరుగుపడుతుంది?


ఓవర్ వెయిట్ ఉన్నవారిలో గుండెలో కొవ్వు పేరుకుపోవడం, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఊబకాయం ఉన్నవారిలో మధుమేహం సమస్య ఎక్కువగా వస్తుంది. లివర్ దెబ్బతింటుంది. మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. ఇలా ఒక్కొక్క అవయవంపై ప్రబావం పడుతూ..రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ క్రమంలో కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus risk ) ప్రమాద తీవ్రత పెరుగుతుందని బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ చెబుతున్నారు. Also read: Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే


కొవ్వు కణజాలంగా పిల్చుకునే యాంజియోటెన్సివ్-కన్వర్టింగ్ ఎంజైమ్ లేదా ACE2 ఎంజైమ్ లావుగా ఉన్నవారిలో అధికంగా ఉంటుంది. ఇది వైరస్ ను కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. రక్తంలోనూ..ఇతర కణజాలాలలో ACE2 ఉంటే...కోవిడ్ 19 వైరస్ ప్రమాదమూ ఎక్కువే.