Wifi Speed Boost: ప్రస్తుతం దేశంలో చాలా మంది ఇంటర్నెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవలే కరోనా సంక్షోభం కారణంగా చాలా ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో వైఫై రూటర్ల వెలిశాయి. దీంతో వైఫై వినియోగం దేశంలో మరింత పెరిగింది. అయితే వైఫై వినియోగదారులు తరచూ ఏవో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి ఇంటర్నెట్ స్పీడ్ రావడం లేదనో.. డేటా కనెక్ట్ ఇష్యూ అని అనేక సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. కానీ, అలాంటి సమస్యలను పరిష్కరించుకోవడం ఇప్పుడు చాలా సులభం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇంటి మధ్యలో వైఫై (Wifi) రూటర్‌..


వైఫై వినియోగదారులు వారి వారి ఇళ్లలో Wifi రూటర్ ను ఇంటి మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని అన్ని మూలలకు వైఫై సిగ్నల్ సమానంగా అందుతుంది. దీంతో ఇంటర్నెట్ స్పీడ్ కూడా క్రమంగా పెరుగుతుంది. 


ఇంట్లోని ఎత్తైన ప్రదేశంలో వైఫై రూటర్..


సాధారణంగా వైఫై రూటర్లు.. సిగ్నల్స్ ను కింది వైపు ప్రసరించే విధంగా రూపొందిస్తారు. కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ ను పొందేందుకు ఎత్తైన ప్రదేశంలో రూటర్ ను ఫిక్స్ చేయడం మేలు. 


వైఫై రూటర్ కు ఎలక్ట్రానిక్ వస్తువులు అడ్డులేకుండా..


వైఫై రూటర్ కు చుట్టు పక్కల ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచరాదు. దానికి ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు సహా గోడ, మెటల్ వస్తువులు దూరంగా ఉండడం వల్ల వైఫై ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.  


Also Read: Goa Special Permit: గోవా వెళ్తున్నారా? ఆ తప్పు చేస్తే రూ.10 వేల జరిమానా తప్పదు!


Also Read: Rid of Lizards: ఇంట్లో బల్లుల బెడదను పొగొట్టుకోవాలంటే ఇదే పరిష్కారం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.