Winter Hair Fall: చలికాలంలో సహజంగానే కేశాలు రాలడం ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా స్కిన్ డ్రై కావడం, చలి కారణంగా తరచూ వేడి నీళ్లలో స్నానం చేయడం ప్రధాన కారణాలని చర్మ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో జుట్టు రాలే సమస్యతో చాలామంది విసిగిపోతుంటారు. మిగిలిన సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో జీవనశైలి సక్రమంగా ఉండదు. ఉరుకులు పరుగుల జీవితంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంటుంది. దాంతో శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుండటం వల్ల కేశాలు పాడవుతుంటాయి. ఆరోగ్యంపై దెబ్బతింటుంది. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. శీతాకాలం వస్తే చాలు డేండ్రఫ్ సమస్య పీడిస్తుంటుంది. 


చాలామంది శీతాకాలం చలి కారణం చెప్పి వేడి నీళ్లతో తరచూ స్నానం చేస్తుంటారు. ఇంకొంతమందైతే అసలు స్నానమే చేయరు. 2-3 రోజులకోసారి చేస్తుంటారు. చలికాలంలో తలస్నానం చేయకపోవడం వల్ల డేండ్రఫ్ సమస్య పెరిగిపోతుంది. కేశాలు బలహీనంగా మారడం, దురద, మంట కారణంగా జుట్టు రాలుతుండటం ఎక్కువౌతుంది. అందుకే శీతాకాలంలో గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేస్తుండాలి. రోజూ క్రమం తప్పకుండా చేయాలి. అంటే తలలో దుమ్ము ధూళి పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. చలికాలంలో సాధారణంగా చర్మం, డ్రైగా మారుతుంటుంది. దాంతో కేశాలకు అందాల్సిన పోషకాలు చేరకపోవడంతో జుట్టు రాలిపోతుంటుంది. 


శీతాకాలంలో కేశాలు ఆరోగ్యంగా ఉండాలంటే వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. వేడి నీళ్లు నేరుగా తలపై పడటం వల్ల స్కాల్ప్ దెబ్బతింటుంది. స్కాల్ప్ లో దురద, మంట, డేండ్రఫ్ సమస్య ఏర్పడుతుంది. కేశాల్లో ఉండే సహజసిద్ధమైన ఆయిల్స్‌ను వేడి నీళ్లు తొలగించడం వల్ల అవి నిర్జీవంగా మారి రాలిపోతుంటాయి.


చలికాలంలో కేశాల సంరక్షణకు పాటించాల్సిన చిట్కాలు


మెంతి నీళ్లు రోజూ పరగడుపున తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చలికాలంలో మెంతి నీళ్లను తలకు రాసుకోవడం వల్ల కేశాలకు కావల్సిన పోషకాలు అద్భుతంగా అందుతాయి. దాంతో మీ కేశాలు మరింత పటిష్టంగా , మృదువుగా మారతాయి. ఇక కొబ్బరి నూనె సహజసిద్ధమైన కండీషనర్ అని చెప్పవచ్చు. కేశాలకు కావల్సిన పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. శీతాకాలంలో కొబ్బరి నూనెతో జుట్టును మాలిష్ చేయడం వల్ల కేశాలు ఆరోగ్యంగా, ధృడంగా మారతాయి. 


గుడ్లలో ప్రోటీన్లు కావల్సినన్ని లభిస్తాయి. కేశాల ఎదుగుదల, ఆరోగ్యానికి గుడ్డు అద్భుతంగా ఉపయోగపడుతుంది. గుడ్డు సొనభాగాన్ని కేశాలకు రాసుకుని ఓ అరగంట తురవాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అల్లోవెరా కూడా మరో అద్భుతమైన పరిష్కారం. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కేశాలకు తేమను అందిస్తుంది. అల్లోవెరా జెల్‌ను కేశాలకు రాసుకుని అరగంట తరువాత ఏదైనా మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.


ఇక మరో అద్భుతమైన చిట్కాల ఉల్లిపాయ రసం. దీనివల్ల సహజసిద్ధంగా రక్త సరఫరా మెరుగుపడుతుంది. కేశాలకు రాయడం వల్ల కేశాల్లో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. కేశాల ఎదుగుదలకు దోహదపడుతుంది. 


Also read: Penu Korukudu Treatment: పేను కొరుకుడు సమస్య నుంచి ఇలా ఉపశమనం పొందండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook