Penu Korukudu Treatment: పేను కొరుకుడు సమస్య నుంచి ఇలా ఉపశమనం పొందండి..!

Penukorukudu: పేనుకొరుకుడు సమస్యతో తీవ్ర ఆందోళన పాడుతున్నవారు హేర్ కేర్ నిపుణులు చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పేనుకొరుడం కారణంగా జుట్టు బట్టతల వస్తుందని అపోహ పడుతుంటారు. తిరిగి జుట్టు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2023, 10:29 AM IST
Penu Korukudu Treatment: పేను కొరుకుడు సమస్య నుంచి ఇలా ఉపశమనం పొందండి..!

Penu korukudu: ఆధునిక కాలంలో చాలా మంది జుట్టు సమస్యతో బాధపడుతుంటారు. జట్టు రాలడం కారణంగా తీవ్ర ఆందోళన చెందుతారు. శరీరంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్, పొల్యూషన్, ఆహార అలవాట్లు మారడం ద్వారా ఈ సమస్య మొదలవుతుందన్ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది పేను కొరుకుడు సమస్యతో బాధపడుతుంటారు. దీని వల్ల బట్టతల సమస్యలు వస్తుంది అని అపోహపడుతుంటారు. పేను కొరుకుడు అంటే ఎంటీ..? ఈ సమస్య నుంచి ఉపశమనం ఎలా పొందవచ్చు అనే ఆంశంపై తెలుసుకుందాం..

పేను కొరుకుడు అంటే?

పేను కొరుకుడు  అనేది.. తల మీద ఉన్న వెంట్రుకలను కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తుంది. అలర్జీ కారణంగా ఈ పేను కొరుకుడు జరుగుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.  అయితే ఈ సమస్య వచ్చినప్పుడే తగిన పరిష్కారాలు పాటించడం వల్ల తిరిగి చుట్టు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ చెప్పిన చిట్యాల ద్వారా పేను కొరుకుడు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

1. తగిన వైద్యం:  పేను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నవారు ఎంతో జాగ్రతగా ఉండాలి. ముందుగా  హేర్ కేర్ నిపుణులు  చెప్పిన సూచనలను పాటించాల్సి ఉంటుంది. వారు చెప్పిన మందులను తప్పకుండా వాడడం ద్వారా తర్వగా ఉపశమనం పొందవచ్చు. 

2. ఎర్ర మందారం:  ఎర్రమందార పూవులు వాడటం వల్ల పేను కొరుకుడు సమస్య నుంచి బయటపడవచ్చు.  పేనుకొరుకుడు ఉన్న  చోట మందారాన్ని రాసుకోవడం ద్వారా త్వరలో కొత్త జుట్టుగా పొందవచ్చు. 

Also Read: Carrots Benefits: ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే క్యారెట్‌ను వదలకుండా ప్రతిరోజు తింటారు..

3. జిల్లేడు పాలు:  జిల్లేడు పాలు పేనుకొరుకుడు సమస్యను నివారిస్తుంది. అయితే ఇది వాడేటప్పుడు మీ చేతులు, కళ్ళకు తాకకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

4. కెమికల్స్ లేని షాంపు: కెమికల్స్‌తో కూడిన షాంపూని కారణంగా సమస్య ఎక్కువుతుందని నిపుణులు అంటున్నారు. కెమికల్స్ లేని షాంపూని వాడటం వల్ల పేను కొరకుడు తగ్గిపోతుందని చెబుతున్నారు.

Also Read: Skin Care Tips: చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఇలా చేయండి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News