Skin care Tips: ప్రతిరోజూ మనం అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కొందరైతే చక్కని ముఖవర్చస్సు కోసం వేల రూపాయలు ఖర్చు చేసి పార్లర్లకు వెళ్తారు. అయితే మన వంటిట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో మీ ముఖాన్ని చంద్రబింబంలా మెరిపించవచ్చని మీకు తెలుసా? దీనికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సని అవసరం కూడా లేదు. అదేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది ముఖం జాగ్రత్తగా కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ చర్మం గురించి చాలా స్పృహతో ఉంటారు. ముఖంపై ఏ కాస్త మచ్చలు లేదా ముడతలు కనిపించినా కంగారు పడతారు. నేటి బిజీ లైఫ్ స్టైల్ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మానికి కలిగే అటువంటి నష్టాన్ని తొలగించి చర్మాన్ని అందంగా ,ఆరోగ్యంగా ఉంచడానికి వివిధ రకాల ఖరీదైన ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ రకమైన ఉత్పత్తులకు బదులుగా, మీరు ఇంట్లో ఉండే కొన్ని చౌక వస్తువులను ఉపయోగించడం వల్ల కూడా చర్మాన్ని కేవలం 7 రోజుల్లో మెరిపించవచ్చు. చర్మాన్ని మచ్చలు లేకుండా ,అందంగా మార్చగల వంటగది వస్తువులు ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం.



పాలు..


పాలు మన అందరి ఇళ్లలో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను కలిగి ఉన్న సంపూర్ణ ఆహారం. దీంతో శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. మీరు రోజుకు రెండుసార్లు ఒక గ్లాసు పాలు తాగి, మీ ముఖానికి పచ్చి పాలను రాసుకుంటే చాలు.. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది, చర్మానికి అవసరమైన పోషణను ఇస్తుంది. 


Also read: Health Benefits of Ram Kand: శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పండు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈరోజు నుంచే మీరూ తింటారు


పెరుగు..


మన రోజువారీ ఆహారంలో పెరుగును వాడతాం. పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి కానీ ఇది మీ ముఖాన్ని కూడా అందంగా మారుస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రోజువారీ ఆహారంలో ప్రతిరోజూ రెండు కప్పుల పెరుగు తినాలి, దీంతోపాటు మీ ముఖానికి పెరుగును కూడా రాసుకోవచ్చు. శనగపిండి, ముల్తానీ మిట్టి వంటి సౌందర్య ఉత్పత్తుల్లో కలిసి ముఖానికి అప్లై చేసుకుంటే మీ ముఖం మెరిసిపోతుంది.


నిమ్మకాయ.. 


నిమ్మకాయ కడుపు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ ముఖానికి నిమ్మకాయను కూడా రాసుకోవచ్చు లెమన్ వాటర్ తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా నయమవుతాయి. నిమ్మరసంలో గ్లిజరిన్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మం అందంగా, మృదువుగా మారుతుంది. దీని ప్రభావం ముఖంపై వెంటనే కనిపిస్తుంది. వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్ లో వీటిని వినియోగిస్తారు.


Also read: Why Black Grapes Costly: ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎందుకు ఖరీదైంది? ఎప్పుడైనా ఈ లాజిక్ ఆలోచించారా ?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter