Periods Kit: ప్రతి అమ్మాయిలో బ్యాగులో ఖచ్చితంగా ఉండాల్సిన కిట్ ఇదే!
Periods Kit For Women: పీరియడ్స్ కిట్ అంటే ప్రతి నెల మహిళల్లో జరిగే మెన్స్ట్రుయేషన్ సమయంలో అవసరమయ్యే అన్ని వస్తువుల సేకరణ. ఇది ప్రతి మహిళకు తన జీవితకాలంలో అత్యంత అవసరమైన కిట్.
Periods Kit For Women: పీరియడ్స్ సమయంలో అసౌకర్యం అనేది ప్రతి అమ్మాయి జీవితంలో ఒక సహజమైన భాగమే. అనుభవం ఉన్నా లేకపోయినా, ప్రతిసారి ఏదో ఒక రకమైన ఇబ్బంది తప్పనిసరిగా ఎదురవుతుంది. ముఖ్యంగా కొంతమందికి తీవ్రమైన నొప్పులు ఉండగా, మరికొంతమందికి మితమైన నొప్పులు ఉంటాయి. వీటితో పాటు కడుపు నొప్ప, వెన్ను నొప్పులు కూడా సర్వసాధారణం. దీంతో పాటు మానసిక స్థితిలో ఎదురుదెబ్బలు తరచుగా సంభవిస్తాయి. అయితే ఇలాంటి సమయంలో పీరియడ్స్ కిట్ ఉండటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అసౌకర్యంగా ఉన్నప్పుడు ఈ కిట్ టీనేజ్ అమ్మాయిల నుంచి మహిళల వరకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కిట్ ఆన్‌లైన్ లో కూడా దొరుకుతుంది. అంతేకాకుండా ఇంట్లోనే మనం కిట్‌ను తయారు చేసుకోవచ్చు.
పీరియడ్స్ కిట్ అంటే ఏమిటి?
పీరియడ్ కిట్ అంటే మహిళలు నెలసరి సమయంలో అవసరమయ్యే అన్ని వస్తువుల ఉండే ఒక చిన్న కిట్ . ఇందులో పిరియడ్స్‌లో అవసరమైన వస్తువులు, మెడిసిన్‌లు ఉంటాయి. అందులో ముఖ్యంగా సానిటరీ నాప్కిన్‌లు, టాంపూన్‌లు ఉంటాయి. తక్కువ రక్తస్రావం ఉన్నప్పుడు బ్యాక్‌అప్‌గా ఉపయోగపడతాయి. నెలసరి సమయంలో కొంతమంది అమ్మాయిలు తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు వారి కోసం పెయిన్ కిల్లర్లు ఈ బ్యాగ్‌లో ఉంటాయి. దీంతో పాటు తడి తుడచుట కర్చీఫ్‌లు, ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది.
పీరియడ్ కిట్ ప్రయోజనాలు:
పీరియడ్ కిట్స్ మహిళలకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. పీరియడ్ కిట్స్‌లో ప్యాడ్లు, టాంపాన్లు లేదా మెన్‌స్ట్రువల్ కప్‌లు వంటి హైజీనిక్ ఉత్పత్తులు ఉంటాయి. ఇది మహిళలకు మంచి స్వచ్ఛతను అందిస్తుంది. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యం. పీరియడ్ కిట్స్‌తో మహిళలు ఎక్కడికి వెళ్లినా ఆత్మవిశ్వాసంగా ఉండగలరు. వారికి అవసరమైన వస్తువులు ఉండటం వల్ల ఎలాంటి చింత ఉండదు. కొన్ని పీరియడ్ కిట్స్‌లో శానిటైజర్లు, వైపులు వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
పీరియడ్ కిట్స్ ఎక్కడ దొరుకుతాయి:
పీరియడ్ కిట్స్ ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతాయి. వీటిని కొనుగోలు చేయాలి అంటే మెడికల్ స్టోర్లుకు వెళ్లవచ్చు. ఇవి పీరియడ్ కిట్స్ కొనుగోలు చేయడానికి అత్యంత సాధారణమైన ప్రదేశాలు. వివిధ బ్రాండ్‌ల పీరియడ్ కిట్స్‌ను కనుగొనవచ్చు. అంతేకాకుండా ఇవి అనేక సూపర్‌మార్కెట్లు పీరియడ్ కిట్స్‌ను వారి హైజీన్ ప్రొడక్ట్స్ సెక్షన్‌లో అందిస్తాయి. మరింత సులభంగా వీటిని కొనుగోలు చేయాలి అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో ఆర్డర్ చేయవచ్చు. కొన్ని స్కూల్స్ , కళాశాలలు తమ విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు పీరియడ్ కిట్స్‌ను అందిస్తాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, NGOలు కూడా తక్కువ ధరకు లేదా ఉచితంగా పీరియడ్ కిట్స్‌ను అందిస్తాయి.
పీరియడ్ కిట్స్ ఎంచుకునేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు:
పీరియడ్ కిట్స్ ఎంచుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లైట్, రెగ్యులర్ లేదా సూపర్ అబ్సార్బెన్సీని ఎంచుకోవచ్చు. ఏదైనా అలర్జీ ఉంటే, అలర్జీకి కారణమయ్యే పదార్థాలను కలిగి ఉన్న పీరియడ్ కిట్స్‌ను తీసుకోకుండా ఉండండి. ప్యాడ్‌లు లేదా టాంపూన్‌లు ఏది ఎక్కువ సౌకర్యంగా ఉంటుందో ఎంచుకోండి.
Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter