Yoga Benefits: శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలనుకునే వారు రోజూ యోగా చేస్తే మేలు జరుగుతుంది. శరీరంలో శక్తి, రక్త ప్రసరణను ప్రోత్సహించడంతో పాటు ఏకాగ్రతను మెరుగ్గా ఉంచడంలో అనేక రకాల యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలో యోగాలోని పశ్చిమోత్తనాసనం లేదా కూర్చొని ఫార్వర్డ్ బెండ్ పోజ్ గురించి తెలుసుకోబోతున్నాం. దీని వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ ఆసనం సహాయకారిగా మారుతుంది. ఈ క్రమంలో పశ్చిమోత్తనాసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమోత్తనాసనం విధానం


1) ముందుగా రెండు కాళ్లను ముందుకు చాచి నేలపై కూర్చోవాలి.


2) ఇప్పుడు లోతైన శ్వాస తీసుకొని.. శరీరాన్ని ముందుకు వంచాలి. 


3) ఆ తర్వాత చేతులతో కాళ్లను పట్టుకొని.. ముక్కును మొకాళ్లకు తాకించాలి. 


4) ఈ భంగిమలో కొద్దిసేపు ఉండి.. ఆ తర్వాత యాథా స్థితికి రావాలి. 


5) మీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఆసనాన్ని ఆచరించండి.


పశ్చిమోత్తనాసనం ప్రయోజనాలు


పశ్చిమోత్తనాసనం వల్ల జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. హామ్ స్ట్రింగ్స్, తుంటికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు నిద్రలేమి సమస్యను దూరం చేయడం సహా మెదడును ప్రశాంతంగా ఉంచేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యం పెంపొందేందుకు సహాయం చేస్తుంది. 


(నోట్: ఈ సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత యోగా నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)       


Also Read: Carrots Benefits: ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల శరీరానికి కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు!


Also Read: Skincare in Summer: వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook