Skincare in Summer: వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి!

Skincare in Summer: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. దీంతో పాటు మన చర్మ సౌందర్యానికి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత మనదే. ఈ క్రమంలో వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 01:10 PM IST
Skincare in Summer: వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి!

Skincare in Summer: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరగ్గా.. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది వాతావరణ శాఖ ప్రకటించింది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం రక్షించుకోవడం సహా చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు సన్ స్ర్కీన్ లోషన్స్ వాడాలి. వాటితో పాటు నేచురల్ ఆయిల్స్ ను వాడితో చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. 

ముఖానికి అర్గాన్ ఆయిల్ పూయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఆర్గాన్ ఆయిల్‌లో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ముఖానికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి.

1. చర్మం తేమ కోసం..

వేసవిలో కూడా చర్మానికి తేమ అవసరం. తేమ కోల్పోతే చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. కానీ ముఖానికి ఆర్గాన్ ఆయిల్ అప్లై చేయడం వల్ల చర్మం ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్‌లను పొందుతుంది. ఇది ముఖం పొడిబారకుండా చేస్తుంది. మీరు రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల ఆర్గాన్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవచ్చు.

2. మరకలను పోగొట్టుకునేందుకు..

ఆర్గాన్ ఆయిల్ ముఖంలోని మచ్చలను పోగొట్టడంలో సహాయపడుతుంది. సూర్యరశ్మి, హార్మోన్ల మార్పులు లేదా వృద్ధాప్యం కారణంగా మీ ముఖంపై మచ్చలు ఉంటే.. మీరు ఈ మచ్చలకు అర్గాన్ ఆయిల్ అప్లై చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. ఆర్గాన్ ఆయిల్‌లో ఉండే విటమిన్ ఇ దీనికి సహాయపడుతుంది.

3. అన్ని రకాల చర్మాలకు ప్రయోజనకరంగా..

ఆర్గాన్ ఆయిల్ వినియోగం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఈ నూనె అన్ని చర్మాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ ఫేస్ ఆయిల్ మరీ బరువుగానూ, తేలికగానూ ఉండదు. అదే సమయంలో ఆర్గాన్ ఆయిల్ రంధ్రాలను అడ్డుకోదు. అందువల్ల ఏ చర్మానికి చెందిన వారైనా ఈ నూనెను ఉపయోగించవచ్చు.

4. యాంటీ ఏజింగ్ లక్షణాలు

చర్మంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, ఫైన్ లైన్స్, లూజ్ స్కిన్ వంటి వృద్ధాప్య సంకేతాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఆర్గాన్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ గుణాలు చిన్న వయస్సులోనే వృద్ధాప్యం నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.

5. సూర్య కిరణాల నుంచి రక్షణ

ఎండాకాలంలో ముఖంపై సూర్య కాంతి ప్రమాదం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. దీని వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు, దద్దుర్లు మొదలైన సమస్యలు ఏర్పడతాయి. కానీ, ఆర్గాన్‌ ఆయిల్‌లో ఉండే విటమిన్‌ - ఈ సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది.

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)       

Also Read: Drinking Water After Food: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసా?

Also Read: AC Cooling Problem: సమ్మర్ లో ఏసీ కూలింగ్ పెరగాలంటే ఈ చిట్కాలు కచ్చితంగా పాటించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News