Yoga Poses For Weak Digestion: అనారోగ్యకరమైన ఆహారాలు రోజు తీసుకోవడం వల్ల చాలా మందిలో జీర్ణక్రియ దెబ్బతింటోంది. దీని కారణంగా చాలా మందిలో మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు వస్తున్నాయి. అయితే చాలా మందిలో దీని కారణంగా ఆహారం జీర్ణం కావడం కూడా తగ్గుతోంది. దీని కారణంగా ఉబ్బరం, అసిడిటీ, త్రేనుపు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే ఎన్నో రసాయనాలతో కూడిన ఔషధాలు వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. తరచుగా ఈ సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని యోగాసనాలు చేయడం వల్ల మంచి సులభంగా ఉపశమనం పొందుతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూషన్ ముద్ర:
పూషన్ ముద్ర ఆసనం ప్రతి రోజు వేయడం వల్ల శరీరాకి బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా మలబద్ధకాన్ని తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యల కారణంగా ఉబ్బరం సమస్యతో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.   


పూషన్ ముద్ర చేసే విధానం:
❂ ముందుగా పద్మాసనంలో కూర్చుని ఎడమ చేతి వేలితో ముక్కు రంధ్రాన్ని నొక్కాల్సి ఉంటుంది. 
❂ ఆ తర్వాత నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకుని రెండవ రంధ్రం ద్వారా బయటకు వదలాలి.
❂ ఇలా చేసిన తర్వాత కుడి చేతి వేళ్లలో, బొటనవేలు ముందు భాగంలో రెండు మధ్యన వేళ్లతో పట్టుకోవాల్సి ఉంటుంది.
❂ ఆ తర్వాత ఇంకో ఎడమ చేతి చివరి రెండు వేళ్లను బోటన వేళ్లకు ఆనించి పట్టుకోవాలి.
❂ ఇలా ప్రతి రోజు చేయడం వల్ల త్రేనుపు, అసిడిటీ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


వజ్రాసనం:
ప్రతి రోజు వజ్రాసనం చేయడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా మోకాళ్లపై కూర్చోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రెండు చేతులను మోకాళ్ల వద్ద ఉంచి పట్టుకోవాలి. ఇలా ప్రతి రోజు 5 నుంచి 8 నిమిషాలు చేస్తే జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా రాకుండా ఉంటాయి. 


పాదహస్తాసనం:
పాదహస్తాసనంతో అన్ని రకాల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. ఆ తర్వాత శరీరాన్ని వంచి తలను నేలపై ఆనించాలి. ఇలా చేసిన తర్వాత మీ రెండు చేతులతో పాదాలను టచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు 10 నుంచి 12 సార్లు చేస్తే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి