Allari Naresh: అల్లరి నరేష్ విషయానికొస్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ల తర్వాత కామెడీ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈయన అంతా కొత్తవాళ్లతో తెరకెక్కించిన ‘రారాజా’ సినిమా టీజర్ ను విడుదల చేసారు. నిమిషన్నర నిడివిగల ఈ టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాలో పాత్ర చూపించకుండా.. ఒక్క డైలాగ్ లేకుండా.. కట్ చేసిన ఈ ట్రైలర్  హారర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టెర్రిఫిక్ గా ఉంది.  విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శకుడి కాన్సెప్ట్, టేకింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉన్నాయి. మొత్తనికి టీజర్ తో సినిమాపై క్యూరియోసిటీని పెంచాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్ లాంచ్ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ..
శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై శివప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన రారాజా సినిమా టీజర్ ని లాంచ్ చేయడం హ్యాపీగా ఉందన్నారు.  దర్శకుడు స్టోరీ చెబుతున్నంత సేపు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో నేను చాల ఎగ్జైట్మెంట్ గా ఫీలయ్యాను.  విషయం ఏంటంటే దీనిలో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి ఫేస్ లు కనిపించకపోవడం ఆసక్తి కలిగించే అంశం. అంతేకాదు మొత్తం ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా ఈ సినిమా ఉంది.



A.I జనరేషన్ లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు. ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ..సినిమా విడుదల కోసం ప్రేక్షకులతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా  తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter