Nenu Keerthana:  ఈ మధ్య చిత్ర పరిశ్రమలో టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్లే నిర్మాతగా మారడమే కాదు.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. తాజాగ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ వేడుకలో ట్రైలర్ ను ప్రదర్శించారు. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, నటీమణులు శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పార్టిసిపేట్ చేసారు. ఈ సినిమాతో చిమటా రమేశ్ బాబు హీరోగా ప్రూవ్ చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను డైరెక్టర్ గా  నిర్మాతగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చిమటా రమేష్ బాబు సరసన రిషిత, మేఘన కథానాయికలుగా నటించారు.  చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించారు. ‘నేను-కీర్తన’ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  


హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ..
‘నేను - కీర్తన’ చిత్ర నిర్మాణంలో తనకు సహకరించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ  పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. తన సోదరి జ్యోతిర్మయి, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ వల్లే ఈ సినిమా చేశానన్నారు. "ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు.  తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ సినిమాగా తెరకెక్కిందన్నారు. "నేను - కీర్తన" ఖచ్చితంగా హిట్ అవుతుందనే  నమ్మకం వ్యక్తం చేశారు.  


ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలో సంధ్య, రేణుప్రియ, జీవా, విజయరంగరాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాధ్  ముఖ్య పాత్రలు పోషించారు. 


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter