Harudu First Glimpse: వెంకట్.. నాగార్జున నిర్మాణంలో వైవీయస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య సహా పలు హీరోల చిత్రాల్లో సెకండ్ హీరో పాత్రల్లో మెప్పించాడు. తాజాగా ఈయన మాస్ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘హరుడు’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న  ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి డైరెక్టర్. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారన్నారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు అద్భుతంగా వచ్చాయన్నారు. జెన్నా పాటలకు సంగీతం అందించారు. ఈ సినిమా విషయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.  
 
దర్శకుడు రాజ్ తాళ్ళూరి  మాట్లాడుతూ..  ముందుగా నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి కి ధన్యవాదాలు. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేయడం అద్భుతం అన్నారు. వెంకట్ గారితో ఐదేళ్ళ జర్నీ కొనసాగింది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో నటించారు. నటశా సింగ్  కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


హీరో వెంకట్ మాట్లాడుతూ.. ‘హరుడు’ చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందన్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయి. నిర్మాత డాక్టర్ అయినా.. సినిమా పై ప్యాషన్ తో  ఈ మూవీ నిర్మించారు.  ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హీరోగా ఫస్ట్ టైమ్ మాస్ హీరోగా నటించాను.  నా పాత్రకు ధీటుగా హెబ్బా పటేల్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పారు.   అలాగే నటశా సింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారన్నారు. గతంలో ఓ సినిమా  షూటింగ్ లో నాకు తీవ్ర గాయాలయ్యాయి.  అందుకే కొంత విరామం కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రేక్షులకు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..