Kaalam Rasina Kathalu: తెలుగు చిత్ర సీమలో సరికొత్త కాన్సెప్ట్ లతో దర్శకులు, నిర్మాతలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో వస్తోన్న మరో సినిమా ‘కాలం రాసిన కథలు’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ బాగున్నాయి. ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా దర్శక, నిర్మాత MNV సాగర్ మాట్లాడుతూ..ఈ సినిమాను మచిలీ పట్నంలోని పెడన ప్రాంతాల్లో పిక్చరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో కొత్త నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నట్టు చెప్పుకొచ్చు.  ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. అంతేకాదు సినిమా ద్వితీయార్ధంలో శివుడి మీద వచ్చే సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇస్తాయని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు.ఈ సినిమాను ఆగష్టు 29న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.


తారాగణం: యమ్ యన్ వి  సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్ , రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్ , రేష్మ, యస్ యమ్ 4 ఫిలిమ్స్  బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రచయత, నిర్మాత, దర్శకుడిగా యమ్ యన్ వి సాగర్.


Read more: Shravana mass 2024: ఆగస్టు నెలలో శ్రావణంతో సహా రాఖీ, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి పండుగల తేదీలివే..


Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter