నటీనటులు: సత్య కేతినీడి, దేవయాని శర్మ, రాజశేఖర్ అనంగి, రాజు గొల్లపల్లి, ప్రదీప్ రాపర్తి, మోహన్ రావు భగవత్, సంతోష్ కావేటి, శాలిని కొండపూడి, గైతమ్ రావు తదితరులు..
సినిమాటోగ్రాఫర్: ప్రణవ్ ఆనంద
ఎడిటర్: సూర్య వినయ్
మ్యూజిక్: వినోద్ కుమార్
నిర్మాత: ఎం.ఎం.విజయ జ్యోతి, ఉజ్వల్ పసునూర్  
దర్శకత్వం: ఉజ్వల్ పసునూర్,  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన తెలుగు సినిమా అంటే ఓ ఫార్ములా ప్రకారం.. మూడు ఫైట్లు.. నాలుగు పాటలు.. నాలుగు కామెడీ సీన్లు అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన దర్శకులు మాత్రం కొత్త తరహా కథలను తెరకెక్కిస్తున్నారు. అందులో ఆంథాపాలజీ నేపథ్యంలో వివిధ కథలను ఒక కథలో మిళితం చేస్తూ తెరకెక్కించి మెప్పిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రమే ‘#లైఫ్ స్టోరీస్’. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా..! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..
ఈ స్టోరీ విషయానికొస్తే.. ఒక సాఫ్ట్ వేర్ ఆఫీసులో స్టార్ట్ అవుతుంది. అతను ఓ క్యాబ్ బుక్ చేసుకొని వెళుతుంటారు. ఈ కోవలో అతనికి కొన్ని పరిస్థితులు ఫేస్ చేస్తాడు. అందులో మిగతా ఐదు కథలతో సంబంధం ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న భార్య తన భర్తలో తన వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది. అలాగే ఒక ఒంటిరి మహిళకు ఒక కుక్క ఏ విధంగా అండగా నిలిచింది. ఎన్నో యేళ్ల తర్వాత కలుసుకున్న పాత మిత్రులు ఏం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎలా బిహేవ్ చేసాడు. ఒ స్కూల్ పిల్లాడికి తన దగ్గర తల్లి లేకుంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసాడు. మొత్తంగా స్నేహం, సహవాసం, ఒంటరితనం, కల్తీ లేని ప్రేమ, సంతోషం ఇలా కలబోసిన అంశాలతో తెరకెక్కించిన ఈ ఆంథపాలజీ కు  ఎలాంటి ముగింపు ఇచ్చారనేదే తెరపై చూడాల్సిందే.  


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


మన నిత్య జీవితంలో జరిగే సంఘటనల సమాహారంగా #లైఫ్ స్టోరీస్’ సినిమాను తెరకెక్కించాడు. వివిధ కథలకు ఒక ముగింపు ఇవ్వడం.. 11 క్యారెక్టర్లు.. ఆరు స్టోరీలను కలిపి మంచి స్టోరీని తెరకెక్కించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి  పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది.  ఇప్పటి వరకు నాలుగైదు కథలతోనే ఆంథాలజీని తీసుకొచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు.  ఉజ్వల్ కశ్యప్ ఏకంగా ఆరు కథలతో ఎన్నో జీవితాలను సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ ముందు ఉంచాడు. ఒక కథతో మరొక కథను లింక్ చేస్తూ సూదిలో దారం ఎక్కించినంత సులువుగా కథల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.


ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో పడుతున్న యాతన నుంచి అతను సాప్ట్ వేర్ జాబ్ నుండి క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు మారాడు. రెండో స్టోరీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే భార్య.. తన భర్తతో కలిసి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఎందుకు చేసుకోలేకపోయిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. మరోవైపు  ఒంటిరి తనంతో జీవితం వెళ్లతీస్తోన్న ఓ పెద్దావిడకు కుక్కు ఎలా తోడుగా నిలిచింది. నాల్గో కథలో  నలభై యేళ్లు దాటిన దంపతులు సెకండ్ హనీమూన్ కు వెళతారు. అక్కడ వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది ఇంట్రెస్టింగ్ గా చూపెట్టాడు. ఐదో కథలో
సింగిల్ పేరెంట్ అయిన అమ్మ (దేవయాని శర్మ) తన కుమారుడిని పట్టించుకోకుండా పని జీవితంగా బతికేస్తూ ఉంటుంది. ఆ బాబుకు పని మనిషే అన్ని రకాలుగా తయారు చేసి  పంపిస్తోంది. నిద్ర పోయి లేచే వరకు తల్లి కనిపించకపోవడం వంటివి బాబు పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందనేది ప్రస్తుతం కొంత మంది పిల్లల విషయంలో జరగుతున్న విషయాలను చూపించాడు. లాస్ట్ కథలో  పీయూష్(సత్య ) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తుంటాడు. తన ప్రేయసితో ఏదో గొడవ పడి న్యూ ఇయర్ పార్టీని సింగిల్‌గా సెలెబ్రేట్ చేసుకోవడం కోసం వికారాబాద్ వెళ్తూ ఉంటాడు. అక్కడ అసలు కథ స్టార్ట్ అవుతోంది. ఇలా ఒక దానికి ఒకటి ఇంటెర్లింక్‌గా ఎలా కనెక్ట్ చేశారనేది ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.


ఈ సినిమాను ఆరు కథల్లోనే ఎన్నో జీవితాలను చూపించాడు దర్శకుడు.  నిజ జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ మూవీకి ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. మనకు తెలియని వాళ్లు నటించడంతో కొంత ఇంపాక్ట్ అవుతుందనే చెప్పాలి. కొంత తెలిసిన నటీనటులు ఉంటే ఈ సినిమా లెవల్ వేరే రకంగా ఉండేది. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.సినిమాటోగ్రఫీ బాగుంది.  ఆర్ఆర్  పర్వాలేదు. ఎడిటింగ్ పర్వాలేదు.


నటీనటుల విషయానికొస్తే..


ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తమ వంతు  న్యాయం చేశారు. అందరు తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా మంగమ్మ పాత్ర పోషించిన పెద్దావడ సహజ సిద్ధంగా నటించారు. ఇక సింగిల్ మదర్ క్యారెక్టర్ చేసిన దేవియాని శర్మ కూడా తన యాక్టింగ్ తో  పర్వాలేదనిపించింది. ప్రైవేట్ బస్సు కండక్టర్‌గా కనిపించిన శుభోదయం సుబ్బారావు అలియాస్ రాజశేఖర్ పాత్ర ఆకట్టుకుంటుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్ పీయూష్ పాత్రలో సత్య నటనతో అట్రాక్ట్ చేసాడు. సతీష్, మంగేష్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లు నవ్వులు పూయించారు. చిన్న పిల్లాడి నుంచి అందరూ బాగా నటించారు.


#లైఫ్ స్టోరీస్ మూవీ రివ్యూ.. ఒక జీవితంతో ముడిపడిన ఆరు కథలు..!


రేటింగ్: 3/5


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.