Guinnis World Record: అవును హైదరాబాద్ మహా నగరం మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక కాబోతుంది. నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం రెడీ అవుతోంది. ఈ శుక్రవారం బాహుబలి కేక్ తయారీతో గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకోవడానికి రెడీ అవుతోంది. దీని కోసం హార్లీస్ ఇండియా  ఏకంగా 3,000 కిలోల రష్యన్‌ మెడోవిక్‌ హనీ కేక్‌ను తయారు చేస్తున్నట్లు ఫైన్ బేకింగ్  సిఇఓ సురేష్‌ నాయక్‌ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్లీస్ నైపుణ్యాన్ని, సృజనాత్మకతను,  అత్యుత్తమమైన బేకింగ్ సంబంధించిన అనేక ఆవిష్కరణలను వరల్డ్ వైడ్ గా అందరికీ తెలిసేలా   స్వచ్ఛమైన తేనెతో ఈ కేక్ ను రెడీ చేస్తున్నారు.  దీని బరువు 3,000 కిలోలు ఉండనుంది. అంతేకాదు  7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు... ఉండబోతుంది కేక్.  ఈ విషయంలో గతంలో స్పిన్నీస్‌ దుబాయ్‌ సృష్టించిన గత రికార్డు కన్నా 10 రెట్లు ఎక్కుగా ఆ రికార్డ్‌ని  బద్దలు కొట్టేందుుకు రెడీ అవుతోంది. ఈ గొప్ప ప్రయత్నంతో మరోసారి హైదరాబాద్ మహా నగరం వేదికగా నిలవబోతున్నట్టు  చెప్పుకొచ్చారు.


ఈ అరుదైన ప్రోగ్రామ్ ఈ శుక్రవారం 6వ తేదీన  హైదరాబాద్ మాయా కన్వెన్షన్‌ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.  దీనితో పాటే ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్  కార్యక్రమాలు, బేకింగ్‌ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. మొత్తంగా ఈ ఆవిష్కరణతో హైదరాబాద్ మరోసారి గిన్నీస్ రికార్డ్స్ కు వేదికగా  నిలవబోతుంది.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.