Wedding Diaries re Set Re Start Movie Review: ‘వెడ్డింగ్ డైరీస్’ (రీ సెట్ అండ్ రీ స్టార్ట్) మూవీ రివ్యూ..
Wedding Diaries re Set Re Start Movie Review: గత వారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా పోలో మంటూ పెద్ద సినిమాలు క్యూ కట్టాయి. దీంతో చిన్న సినిమాల విడుదలకు నోచుకోలేదు. అందుకే ఈ వీక్ అర డజనుకు పైగా చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోరుతూ వచ్చాయి. అందులో ‘వెడ్డింగ్ డైరీస్ రీ సెట్ రీ స్టార్ట్ మూవీ ఒకటి. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
నటీనటులు: అర్జున్ అంబటి,చాందినీ తమిళరసన్, రవి శివ తేజ, చమ్మక చంద్ర, జయలలిత, సత్య శ్రీ, శ్రీవాణి త్రిపురనేని తదితరులు
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్ యెల్లుమహంత్రి
సంగీతం: మదీన్ ఎస్కే
డిస్ట్రీబ్యూషన్: మహా మూవీస్
నిర్మాత : వెంకట రమణ మిద్దే
రచన, దర్శకత్వం: వెంకట రమణ మిద్దే
అర్జున్ అంబటి, చాందినీ తమిళరసన్ జోడిగా నటించిన సినిమా ‘వెడ్డింగ్ డైరీస్’ రీ సెట్ రీ స్టార్ట్. వెంకట్ రమణ మిద్దె దర్శకత్వం వహించారు. ఎం.వి.ఆర్ స్టూడియోస్ బ్యానర్ పై వెంకట్ రమణ మిద్దె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్స్ తోనే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ప్రశాంత్(అర్జున్ అంబటి) ఓ సాదాసీదా ఫోటోగ్రాఫర్. అతను మోడలింగ్ ఫోటోగ్రాఫర్ గా కావాలన్నది అతని కల. ఈ క్రమంలో అతనికి పరిచయమైన శృతి (చాందినీ తమిళరసన్) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇతని ప్రపోజల్ ను ఓకే అంటుంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వీరికో పాప, బాబు పుడతారు. పిల్లల పుట్టిన తర్వాత వీరి మధ్య పొరపొచ్చాలు ఏర్పడుతాయి. అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేక సతమత మవుతుంటాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడుతాయి. అది విడాకుల వరకు వెళుతుంది. చివరకు వీళ్లిద్దరు విడాకులు తీసుకునే నిర్ణయాన్ని వాయిదా వేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకున్నారా లేదా అనేదే ‘వెడ్డింగ్ డైరీస్’ రీ సెట్ రీ స్టార్ట్ మూవీ స్టోరీ.
కథనం, విశ్లేషణ..
దర్శకుడు మిద్దె వెంకటరమణ ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ యువకులు .. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా విడిపోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈగోలకు వెళ్లి చక్కటి జీవితాన్ని బజారు పాలు చేసుకుంటారు. ఈ పాయింట్ ను బేస్ చేసుకునే దర్శకుడు వెడ్డింగ్ డైరీస్ అనే సినిమా కథను ఇప్పటి యువతకు కనువిప్పు కలిగేలా తీర్చిదిద్దాడు. సంసారం అన్నాకా.. కొన్ని మనస్పర్థలు కామన్. కొంత మంది చిన్న చిన్న సిల్లీ విషయాలకే విడిపోవడం రోజు టీవీల్లో పత్రికల్లో మన చుట్టుపక్కలా చూస్తూ ఉన్నాము. అదే పాయింట్ ను ఏంతో హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు. అంతేకాదు ఈ సినిమాకు రీ సెట్ అండ్ రీ స్టార్ట్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. అంటే ప్రతి వ్యక్తి తమ జీవితంలో పాత దాన్నే తలుచుకుంటూ ఉండటం కన్నా.. కొత్తగా ఫోను లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను రీ స్టార్ట్ చేస్తామో.. మన జీవితాలను కూడా రీ సెట్ చేసుకొని రీ స్టార్ట్ చేస్తే ఎంతో బాగుంటుందనే సందేశం ఇచ్చాడు. ఈ సినిమాలో ‘రాజా రాణి’ మూవీ ఛాయలు కనిపిస్తాయి.
పెళ్లి, సంసారం, జీవితం ఇలా ప్రతి ఒక్కరితో ముడిపడిన సెన్సిబుల్ అంశాన్ని అంతే సున్నితంగా చెప్పాడు దర్శకుడు. కలిసుండటం, గొడవపడటం కంటే విడిపోతే వచ్చే కష్టాలని ఈ సినిమాలో హైలెట్ చేసాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ హీరో, హీరోయిన్ లవ్, మ్యారేజ్.. సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ అయితే ఇప్పటి యువతకు ఓ సందేశం అనే చెప్పాలి. మదీన్ ఎస్.కె ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓ రకంగా సినిమాకి ప్రాణంలా నిలిచింది. పాటలు పర్వాలేదు. ఈశ్వర్ ఎళ్ళుమహంతి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
అర్జున్ అంబటి తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. పెళ్లైన యువకుడి పాత్రలో చక్కటి నటన కనబరిచాడు. హీరోయిన్ చాందినీ తమిళరసన్ పాత్ర చాలా టిపికల్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. తన నటనతో ఈ పాత్రకి జీవం పోసింది.గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన
దర్శకత్వం
సెకండాఫ్
మైనస్ పాయింట్స్ :
అక్కడ లాజిక్ లేని సీన్స్
ఫస్ట్ హాఫ్ రొటీన్
ఎడిటింగ్
పంచ్ లైన్.. యూత్ కు సందేశం ఇచ్చే ‘వెడ్డింగ్ డైరీస్’ (రీ సెట్ రీ స్టార్ట్)
రేటింగ్ : 2.75/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి