క్రిస్మస్ వేడుకల్లో అపశృతి; ముగ్గురు తెలుగు విద్యార్ధులు సజీవదహనం
క్రిస్మస్ వేడుకల్లో జరుపుకుంటున్న సమయంలో ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్రిస్మస్ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ముగ్గరు విద్యార్ధులు సజీవ దహనమయ్యారు.. క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్థానిక మీడియా కథనం ప్రకారం మంగళవారం అర్థారాత్రి సమయంలో అమెరికా కొలిర్‌విలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన విద్యార్ధులు నల్గొండ జిల్లా కేతే పల్లి మండలం గుర్రపుతండాకు చెందిన స్వాతినాయక్, సుహాన్ నాయక్, జయ్ సుచితగా పోలీసులు గుర్తించారు.
గత ఏడాది వరకు హైదరాబాద్ లోని విద్యనభ్యసించిన ఈ విద్యార్ధులు చదువు కోసం అమెరికాకు వెళ్ళారు. అమెరికాలోని గ్లోబల్ అకాడమిలో జయ్ సుచిత 11వ తరగతి, సుహాన్ నాయక్ 10 తరగతి, స్వాతినాయక్ 9వ తరగతి చదువుతున్నారు. క్రిస్మస్ సెలవులు కావడంతో సెలబ్రేషన్స్ లో నిమగ్నమై ఉండగా ..ఇంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ముగ్గరు విద్యార్ధులతో పాటు ఓ వ్యక్తి సజీవ దహనమయినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నారు