Avinashreddy Bail: అవినాష్ రెడ్డికి భారీ ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Avinashreddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి భారీ ఊరట లభించింది. హోరాహోరీగా రెండ్రోజులు సాగిన వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Avinashreddy Bail: ఎట్టకేలకు సీబీఐ అరెస్టు నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాత్కాలికంగా తప్పించుకున్నారు. రెండ్రోజులపాటు సాగిన వాదనల అనంతరం తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే సంకేతాల నేపధ్యంలో తెలంగాణ హైకోర్టులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై వాదనలు రసవత్తరంగా సాగాయి. చివరికి టీఎస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకూ నాలుగుసార్లు విచారించిన సీబీఐ మరోసారి విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈలోగా అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్‌పై విచారణ నేపధ్యంలో సీబీఐ నిన్న జరగాల్సిన విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ కూడా హైకోర్టులో బెయిల్ పిటీషన్‌పై విచారణ కొనసాగడంతో హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి సీబీఐ విచారణ వాయిదా వేసుకుంది. అంటే రేపు ఉదయం అవినాష్ రెడ్డిని విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటీషన్‌పై వాదనలు హోరాహోరీగా నిన్నటి నుంచి కొనసాగాయి. చివరికి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. విచారణ మొత్తం రికార్డు చేయడమే కాకుండా..ప్రతిరోజూ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తుది తీర్పు ఈ నెల 25న రానుంది.
Also read: YS Avinashreddy: ముందస్తు బెయిల్ విచారణ ప్రారంభం, సీబీఐ విచారణ రేపటికి వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook