KTR speech at Davos WEF: హైదరాబాద్ నగరం లైఫ్‌ సైన్సెస్‌కు క్యాపిటల్‌గా ఉందని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఫార్మాసిటీ పేరుతోప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ని హైదరాబాద్‌ శివారుల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో భాగంగా లైఫ్‌ సైన్సెస్‌ రంగంపై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. పలు అంశాలపై వివరంగా మాట్లాడారు. ఈ ప్యానల్‌ డిస్కషన్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ తరపున జీవీ ప్రసాద్ రెడ్డి, పీడబ్ల్యూసీ తరపున మహ్మద్‌ అథర్‌ పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రం నుంచి సరైన సహకారం లేదు
తెలంగాణ ప్రభుత్వం ఎంతగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నా.. వందలాది కంపెనీలను ఆహ్వానిస్తున్నా.. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు లభించడం లేదని కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. లైఫ్‌ సైన్సెస్ ఫార్మారంగం భవిష్యత్తులో మరింత విస్తరించాలంటే సరికొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. హైదరాబాద్ సిటీ ప్రస్తుతం లైఫ్ సైన్సెస్‌ రంగంలో దేశంలోని ఇతర నగరాలకంటే చాలా ముందున్నదన్నారు కేటీఆర్. కొత్త మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను క్రమంగా దాటి భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ రంగం దూసుకెళ్తోన్న పరిస్థితుల్లో ఐటీ రంగం, ఫార్మారంగం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. నోవర్టిస్ సంస్థ తన అతిపెద్ద రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. 


పరిశోధన, అభివృద్ధి రంగాన్ని దేశంలో ముందుకు తీసుకెళ్లాలంటే.. విదేశీ పెట్టుబడులకు సులభతరమైన విధానాలను రూపొందించాల్సి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలపై పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి అయినందున.. ఈ అంశంలో కేంద్రం మరింత చొరవ చూపించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్‌. 


మరో పదేళ్లు లైఫ్ సైన్సెస్ రంగానిదే..
భవిష్యత్తులో కనీసం దశాబ్దం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న కేటీఆర్‌.. ఇప్పుడు అందుబాటులో ఉన్న కేవలం మందుల తయారీపైనే కాకుండా నూతన మాలిక్యూళ్లను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుందని సూచించారు. మనదేశంలో నైపుణ్యానికి కొరత లేదని, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇదే దిశగా చర్యలు చేపడుతోందని, లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందిస్తోందని, అనేక కార్యక్రమాలను చేపడుతోందని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తోందని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.


Also read : British Airways: హైదరాబాద్-లండన్ విమానాల్లో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకం


Also read : Sunil Chopra: బ్రిటన్‌లో రెండోసారి మేయర్‌గా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.