Viral: నీరు, కరెంటు, నెట్ లేదు.. అయినా ఆ ఇంటి ధర రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా?
ఆ ఇంట్లో నీరు, కరెంట్, ఇంటర్నెట్ ఏమీ లేవు. అయినా సరే దాని ధర కోట్లలో. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది? దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు అంత ధర? అని అనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ ఓ లుక్కేయండి.
No Electricity House: చుట్టూ ఎత్తైన కొండలు..ఓ వైపు విశాల సముద్రం...ఎటూ చూసిన పచ్చదనం..ఇవన్నీ ఉన్న చోట ఓ ఇల్లు ఉంటే... ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. అలాంటి ఇంట్లో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. కాకపోతే... ఆ ఇంట్లో నీరు, కరెంటు, ఇంటర్నెట్ వంటివి ఉండాలి. అవి లేకపోతే ఇబ్బందే. అవేమీ లేకపోయినా పర్వాలేదు అనుకునేవారికి మాత్రం ఆ ఇల్లు తెగ నచ్చేస్తుంది. బ్రిటన్‌లోని దేవన్ (devon)లో సముద్రం పక్కనే ఉంది ఆ కాటేజీ (house on sale). దాని మార్కెట్ విలువ ఇప్పుడు రూ.5.56 కోట్లు.
మన్సాండ్ సముద్ర తీరం పక్కన దూరంగా ఉన్న గేట్‌వే (remote gateway)లో ఈ ఇల్లు ఉంది. ఈ సముద్ర తీరం (beach) నేషనల్ ట్రస్ట్‌కి చెందినది. ప్రశాంత వాతావరణంలో జీవించాలి అనుకునేవారికి ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది. చుట్టూ ప్రకృతి వారిని పలకరిస్తుంది. కానీ ఇదంతా చూసి ఇంటిని కొనుక్కుంటే మాత్రం ఆ తర్వాత చుక్కలు కనిపించే ప్రమాదం ఉంది.
ఈ ఇంటికి కరెంటు(Electricity) లేదు, వాటర్(Water) లేదు, ఇంటర్నెట్(Internet) కూడా లేదు కాబట్టి ఇంట్లో ఉండేవారికి టైమ్ పాస్ అవ్వదు. పోనీ పక్కన సముద్రం ఉంది కదా అనుకుంటే... అదేమో కొండ కింద ఉంది. అక్కడికి వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయినా కంటిన్యూగా సముద్రం దగ్గరే ఏం కూర్చుంటారు. ఈ ఇంట్లో 2 పెద్ద బెడ్‌రూంలు ఉన్నాయి. పైన పెద్ద లాఫ్ట్ రూమ్ (loft room) ఉంది. ముందు, వెనక పోర్ష్ (porch) ఉన్నాయి. అలాగే అదనంగా 2 బెడ్‌రూంలు, ఓ షవర్ రూమ్, ఓ కిచెన్ ఉన్నాయి. ఇంటి లోపల 1,345 చదరపు అడుగుల (sqft) స్పేస్ ఉంది.
Also Read: వాళ్లిద్దరి ఒంటిపై దుస్తులతో సహా అన్ని లాకెళ్లిన బిగ్ బాస్! ఏం జరిగిందంటే..
కరెంటు లేకుండా మరి ఇంట్లో చలి వాతావరణం నుంచి వేడి కావాలంటే... 2 మల్టీ ఫ్యూయల్ బర్నర్లు ఉన్నాయి. కిచెన్‌లో గ్యాస్ కుక్కర్, ల్యాంప్స్ ఉన్నాయి. LPG గ్యాస్ సప్లై ఉంది. ఇంటి పైన వర్షపు నీటిని మంచి నీరుగా మార్చే వ్యవస్థ ఉంది. (rainwater harvesting system) దాని ద్వారా నీరు సంపాదించుకోవచ్చు. సముద్రం దగ్గరకు కారులో వెళ్లొచ్చని ఇంటి ఓనర్ మిషెల్లే స్టీవెన్స్ తెలిపారు. ఐతే... కార్ పార్కింగ్ ప్లేస్ ఇంటికి దూరంగా ఉంది. అక్కడ పార్క్ చేసి ఇంటికి నడుస్తూ వెళ్లడానికి పావుగంట పడుతుంది. అది ఎవరికీ నచ్చట్లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook