Bigg Boss 5 Telugu: విశ్వకి పవర్ రూమ్ యాక్సెస్...లేడి గెటప్ లో రవి..అబ్బాయి డ్రెస్‌లో ప్రియ! అసలేం జరిగిందంటే..

Bigg Boss 5 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ సందడి షురూ అయ్యింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కొంచెం వెరైటీగా ఫ్లాన్ చేసింది బిగ్ బాస్ టీం. ఈసారి హౌస్ లోకి ఏకంగా 19 మంది సభ్యులను పంపడమే కాకుండా..తొలిసారి పవర్ రూమ్ ని పరిచయం చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2021, 05:07 PM IST
Bigg Boss 5 Telugu: విశ్వకి పవర్ రూమ్ యాక్సెస్...లేడి గెటప్ లో రవి..అబ్బాయి డ్రెస్‌లో ప్రియ! అసలేం జరిగిందంటే..

Bigg Boss 5 Telugu:  బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్‌లోకి ఏకంగా 19 మందిని పంపి షాకిచ్చాడు బిగ్‌బాస్‌. తొలి రోజు మూడు టాస్కులు ఇచ్చి గేమ్‌ స్టార్ట్‌ చేసిన బిగ్‌బాస్‌.. రెండో రోజు నామినేషన్ల ప్రక్రియతో ముగించాడు. ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారిలో రవి, మానస్‌, సరయూ, కాజల్‌, హమీదా, జెస్సీలు ఉన్నారు.  ఇక అసలు కథ ఈ రోజు నుంచే మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. 

గేమ్‌లో భాగంగా తొలిసారి పవర్‌ రూమ్‌(Power Room)ని పరిచయం చేశాడు బిగ్‌బాస్‌(Bigg Boss). దీని కోసం ఓ గేమ్‌ పెట్టగా, అందులో విశ్వ(Viswa) గెలిచాడు.అయితే ఇక్కడ విశ్వకి ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తాను ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్‌ రూమ్‌లో పెట్టాలని చెప్పాడు. దీంతో యాంకర్‌ రవి(Anchor Ravi), ప్రియ(Priya)లను ఎంచుకున్నాడు విశ్వ. వారిద్దరి దుస్తులలతో పాటు అన్ని వస్తువులు లాక్కెళ్లిపోవడంతో రవి, ప్రియ వెరైటీ డ్రెస్సుల్లో కనిపించారు. యాంకర్‌ రవి లేడీస్‌ డ్రెస్‌ ధరించగా, ప్రియ అబ్బాయి డ్రెస్‌లో కనిపించి షాకిచ్చింది. ఇక అమ్మాయి డ్రెస్‌లో ఉన్న రవిని ఎత్తుకొని సందడి చేశాడు విశ్వ. 

Also Read; Bigg Boss Telugu season 5: బిగ్ బాస్ తెలుగు 5 నామినేషన్స్‌.. తొలి రోజే Vishwa vs Jessi, VJ Sunny vs Sarayu

మరోవైపు ప్రియాంక సింగ్‌ (Priyanka singh) ఏమో మానస్‌ని తనదైన శైలీలో ఆటపట్టించింది. రవిని, విశ్వని అన్నయ్య అని పిలుస్తా కానీ, మానస్‌ని మాత్రం అలా పిలవలేనని చెప్పడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున​ నవ్వారు. మరి ఇంకా బిగ్‌బాస్‌ ఇంట్లో ఎలాంటి సందడి జరిగిందో తెలియాలంటే నేటి సాయంత్రం ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News