Sun Ketu Conjunction Effect: సూర్య, కేతు ఎఫెక్ట్.. మనుషుల జీవితాల్లో వచ్చే ఊహించని మార్పులు ఇవే!

Tue, 17 Sep 2024-11:35 am,

ఇప్పటికే కన్యారాశిలో కేతు గ్రహం ఉంది. సూర్య గ్రహం ప్రవేశించడం కారణంగా సూర్య, కేతు కలయిక జరిగింది.  ఈ కలయిక కారణంగా 12 రాశుల వారి పైన తీవ్రమైన ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

ఈ కలయిక ఎంతో శుభకరమైనది. సూర్య, కేతు కలయిక కారణంగా జీవితాల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? అయితే ఆర్థికంగా , వృత్తిపరంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది  అనేది మనం తెలుసుకుందాం.  

కన్య రాశిలో కేతు సూర్య కలయిక ప్రత్యేకత: ఈ సంయోగం పన్నెండు రాశుల వారిపైన ఉంటుంది. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి చేరుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ కలయిక కారణంగా కెరీర్ వృత్తి ఉద్యోగ పరంగా మెరుగుపడడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. 

సూర్య, కేతు కలయిక కారణంగా ఆర్ధికంగా, కెరీర్‌, ప్రేమ, ఆరోగ్యం పట్టు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకుందాం. 

ఆర్థిక పరిస్థితి పై కేతు సూర్య ఎఫెక్ట్: ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. డబ్బు ఖర్చే చేయడంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ధన నష్టం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వృధగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి డబ్బు విషయంలో ఆచితూచి అడుగు వెయ్యాల్సి ఉంటుంది.  

కెరీర్‌ పై సూర్యకేత్ ఎఫెక్ట్ : ఈ కేతు, సూర్య కలయిక కారణంగా కెరీర్‌ పై కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సంయోగం వల్ల కెరీర్‌ పైన చాలా మంది ఆందోళన  చెందుతూ ఉంటారు. అలాగే ఎంతో కష్టపడితే కానీ అనుకున్నా పనులు పూర్తి కావు. సూర్యదేవా ఆరాధన చేయాల్సి ఉంటుంది కేతు ప్రభావం కారణంగా కొన్నిసార్లు మనోధయాన్ని కోల్పోయే పరిస్థితి కలుగుతుంది. 

ఆరోగ్యం పై కేతు సూర్య ఎఫెక్ట్ : సూర్య, కేతు గ్రహాల కలయిక కారణంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కేతు గ్రహం కారణంగా  దెబ్బలు, మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు  తలెత్తుతాయి. జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేయాలి.   

ప్రేమ జీవితం పై కేతు సూర్య ఎఫెక్ట్ : ప్రేమ జీవితం పైన సూర్య, కేతు కలయిక ఎంతో ప్రభావితం చూపుతుంది. ఈ సమయంలో ఎంతో ఆచితూచి  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. కేతు ప్రభావం కారణంగా అక్రమ సంబంధాలు లేదా భాగస్వామితో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్య, కేతు గ్రహాలని ఎల్లప్పుడూ దర్శించుకోవాల్సి ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link