8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపుపై త్వరలో మెగా అప్డేట్..!

Tue, 10 Sep 2024-10:05 pm,

గత కొద్దిరోజులుగా నిత్యవసర ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో జీతం చాలడం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2026 జనవరి నుంచి మొదలు పెట్టాల్సిన 8వ  పే-కమీషన్ ఇప్పుడే సవరించాలని.. ఉద్యోగస్తులు కోరుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికిప్పుడు 8వ పే కమిషన్ అమలు చేయాలంటే ప్రభుత్వంపై.. చాలా భారం పడుతుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా డి ఎ పెంచుతూ నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. 

అయినా సరే ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు ఆగకపోవడంతో తాజాగా ఎనిమిదవ పే కమిషన్ పై ప్రభుత్వం కొంత అప్డేట్ ఇవ్వనుంది అని సమాచారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ సిస్టం స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.   

ఇకపోతే  ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లు ఎదురుచూడడమే కాదు ఎనిమిదో వేతన సంఘం అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.   

ఇప్పుడు త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఒక విధమైన అప్డేట్ ఇవ్వవచ్చు అని వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కొత్త పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రవేశపెడతారు. 7వ వేతన సంఘం 2016లో ప్రవేశపెట్టబడగా.. దీని ప్రకారం 2026 లో 8వ వేతన సంఘం అమలులోకి రావాలి. అందుకే ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించినప్పటికీ కూడా.. ప్రభుత్వం దీనికి సన్నహాలు ప్రారంభించిందనే.. ఒక వార్త బయటకొచ్చింది.  

నిజానికి ఏడవవేతన సంఘం ఫిబ్రవరి 2014లోనే ఏర్పాటైనా.. 2016 జనవరి 1 నుంచి అమలులోకి తీసుకొచ్చారు.ఈ నామినేషన్లు డిసెంబర్ 31 2025న ముగుస్తాయి. కాబట్టి ఎనిమిదవ వేతన సంఘం.. 2026 జనవరిలో అమలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. 

మరి మోడీ ప్రభుత్వం 2025 - 26లో 8వ పే కమిషన్ ను 10 సంవత్సరాల కాలానికి గనుక అమలు చేసినట్లయితే దాదాపు కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు లాభపడతారు.  పే కమిషన్ అమలు చేయడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే ఆనాటికి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.   

ఈ జీతాల పెంపు అనేది లెవెల్ వన్.. ఉద్యోగులకు 34% వరకు అలాగే లెవెల్ 18 ఉద్యోగులకు 100% వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. అయితే లెవెల్ వన్ యొక్క జీతం రూ.34,560 పెరిగితే , లెవెల్ 18 జీతం రూ.4.8 లక్షల వరకు పెరగొచ్చు అని అంచనావేస్తున్నారు. 

ఇకపోతే ఎనిమిదవ పే కమిషన్ లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా కేంద్ర ఉద్యోగులు కనీస వేతనం రూ.7000 నుంచి రూ.18 వేలకు పెరిగింది.  

మరి ఎనిమిదవ వేతన సంఘం అమలులోకి రావడంతో తో గుణిస్తే నెలవారీ జీతం రూ.18 వేల నుంచి రూ.26 వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు 44% వృద్ధి కనిపిస్తోంది. 

అందుకే ఎనిమిదో వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఎంప్లాయిస్ ఫెడరేషన్, నేషనల్ జాయింట్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్,  ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్ తో పాటు పలు ఉద్యోగుల సంస్థలు లేఖ రాశాయి. త్వరలోనే దీనిపై అప్డేట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link