Nayanthara: అతడు నన్ను బలవంతం చేశాడు.. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు..నయనతార సంచలన వ్యాఖ్యలు..!
నయనతార.. తెలుగులో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, సౌత్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. కన్నడ, మలయాళం, తమిళ్ భాషా చిత్రాలలో నటించి మెప్పించిన నయనతార,ఇప్పుడు హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
కెరియర్ పరంగా ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకుందో వ్యక్తిగతంగా అన్ని విమర్శలు కూడా అందుకుంది. ముఖ్యంగా ఇద్దరితో ఎఫైర్ నడిపి వార్తల్లో నిలిచిన ఈమె, చివరికి విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అనంతరం సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలోకి ఎవరి సహాయం లేకుండా వచ్చి, నేడు లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తుంది నయనతార. ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది.
ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్.. పారితోషకాన్ని కూడా వెనక్కి నెట్టి స్టార్ స్టేటస్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె కష్టాన్ని గుర్తించిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈమె బయోపిక్ ఆధారంగా డాక్యుమెంటరీ తీస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ డాక్యుమెంటరీ కి సంబంధించిన ట్రైలర్ విడుదల అందులో ఎన్నో విషయాలు పంచుకుంది నయనతార. అందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. అతను నన్ను సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోమని చెప్పాడు. కనీసం నాకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. దాంతో కొద్దిరోజులు నేను ఇండస్ట్రీకి దూరమయ్యాను. కానీ అవకాశాలు వస్తుండడంతో కెరియర్ పోగొట్టుకోవడం ఇష్టం లేక మళ్ళీ వచ్చాను అంటూ చెప్పినట్టు సమాచారం.
అయితే ఈమెకు ఎవరు సినిమాల.. నుండి దూరం అవ్వమని ఎవరు.. చెప్పారు అనే విషయంపై మాత్రం నయనతార క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి అయితే నయనతార చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.