Anant Ambani And Radhika Merchant Wedding: ముఖేష్ అంబానీ ముద్దుల కోడలు రాధిక మర్చెంట్ 7 బ్యూటీ సీక్రెట్స్..
ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ముఖేష్ అంబానీ ఇంట అడుగుపెడ్డుతున్న కొత్తపెళ్లి కూతురు రాధిక మర్చెంట్ మెరిసే, మృదువైన ముఖానికి ఆమె ఫాలో అయ్యే బ్యూటీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
రాధిక మర్చెంట్ ఎక్కువ శాతం ఇంటి ఫుడ్, హోం రెమిడీలనే ఫాలో అవుతుందట. ముఖ్యంగా ఆమె బ్యూటీ రొటీన్లో క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్ తప్పనిసరిగా ఉంటుందట. ఇది సూర్యుని నుంచి వెలువడే అల్ట్రా వైలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
క్లీన్ డైట్.. రాధిక మెరిసే చర్మానికి, అలలంటి జుట్టుకు సమతుల్య ఆహారం కారణమట. ఆమె ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గింజలను ఎక్కువగా తీసుకుంటుందట. ఈ డైట్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి.
హైడ్రేట్.. రాధిక రోజంతటికి సరిపడా పుష్కలమైన నీరు తాగుతుందట. రోజంతటికి సరిపడా నీరు తీసుకోవడం వల్ల స్కిన్ సాగే గుణానికి సహకరిస్తుంది. ముఖం కూడా డ్రై కాకుండా కాపాడుతుంది.
ఎక్సర్‌సైజ్.. రాధిక ప్రతిరోజూ ఫిజికల్ ఫిట్నెస్ తగినంత సమయం కేటాయిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. ఆమె వర్కౌట్లో కార్డియో, యోగా, బ్లడ్ సర్క్యూలేషన్ పెంచే ఆసనాలను ఫాలో అవుతుందట.
జుట్టు ఆరోగ్యం.. రాధిక మర్చెంట్ హెయిర్ కేర్ పై కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. తరచూ జుట్టుకు కొబ్బరి, బాదం నూనెతో మసాజ్ చేసుకుంటారట. ఇది మంచి జుట్టు ఆరోగ్యానికి మంచివి.
స్ట్రెస్.. రాధిక మెడిటేషన్ కూడా చేస్తుందట. ఇది తనకు స్ట్రెస్ నుంచి దూరంగా ఉంచుతుంది. ప్రస్తుతం పెళ్లి ఘడియలు దగ్గరపడుతున్నాయి. ఆమె ప్రీ వెడ్డింగ్ లో కూడా ఎంతో కూల్ గా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మెడిటేషన్.
మంచి నిద్ర.. రాధిక బ్యూటీ స్లీప్ ను కూడా ఫాలో అవుతుంది. ఇది స్కిన్ డ్యామేజ్ కాకుండా ఆమె అందంగా కనిపించడానికి ప్రోత్సహిస్తుంది. ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఇది కీలకపాత్ర పోషిస్తుంది.