Sobhita Dhulipala: శోభితా పేరేంట్స్ తో నాగ చైతన్య ఫ్యామిలీ.. పిక్స్ వైరల్..
ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ, మీడియా కాకుండా ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ఆల్రెడీ ఒక కథానాయికను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన తర్వాత మరోసారి కూడా ఒక హీరోయిన్ నే నాగ చైతన్య పెళ్లాడటం విశేషం.
ఆగష్టు 8న ఉదయం 9.42 నిమిషాలకు శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా చైతూ, శోభిత తల్లిదండ్రులు సాంప్రదాయ బద్ధంగా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా శోభిత తల్లిదండ్రులు వేణు గోపాల్ రావు, శాంతి కామాక్షి దంపతులుతో పాటు నాగ చైతన్య తండ్రి పిన్ని అయిన నాగార్జున, అమలతో ఫోటోలకు ఫోజులిచ్చారు.
అంతేకాదు వీరి పెళ్లి ఈ యేడాది కార్తీక మాసంలో జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అక్కినేని కాంపౌండ్ ప్రకటన వస్తే కానీ.. క్లారిటీ లేదు.
శోభితా తల్లిదండ్రుల విషయానికొస్తే.. తండ్రి వృత్తి రీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత వీళ్లు ముంబైకు షిఫ్ట్ అయ్యారు. అక్కడే శోభితా ఉన్నత చదువులు చదివింది.
శోభితా..తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో నాగ చైతన్యతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.
నాగ చైతన్య విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఇయరే ప్రేక్షకల ముందుకు రానుంది. ఇప్పటి వరకు కనిపించని క్యారెక్టర్ లో చైతూ కనిపించబోతున్నాడు.