Forbes List: సంపాదనలో నంబర్ 1 అల్లు అర్జున్.. ఫోర్బ్స్ టాప్ 10 హీరోల పారితోషికం జాబితా ఇదే!
భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితా విడుదల చేసిది. టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టగా.. మన అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు.
అల్లు అర్జున్ పారితోషికం రూ.300 కోట్లు. పుష్ప 2: రూల్. దేశంలోనే అత్యధికంగా పారితోషికం పొందుతున్న నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. తెలుగులోనే కాదు దేశంలోని అన్ని పరిశ్రమల కన్నా అత్యధికంగా అర్జున్ పొందుతున్నాడు.
జోసెఫ్ విజయ్ రూ.130 కోట్ల నుంచి రూ.275 కోట్లు. తలపతి 69, గోట్, లియో సినిమాలకు ఆ స్థాయిలో పారితోషికం పొందారని ఫోర్బ్స్ వెల్లడి
షారూఖ్ ఖాన్ రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్లు. డుంకీ సినిమాకు భారీ స్థాయిలో పారితోషికం పొందిన షారూఖ్ ఖాన్ బాలీవుడ్‌లో సంపాదనపరంగా మొదటి స్థానంలో ఉన్నాడు.
రజనీకాంత్ రూ.125 కోట్ల నుంచి రూ.270 కోట్లు. వెట్టయన్, జైలర్ సినిమాలకు అందుకున్న పారితోషికం.
అమీర్ ఖాన్ రూ.100 కోట్ల నుంచి రూ.275 కోట్లు. లాల్ సింగ్ చద్దా సినిమాకు పొందిన పారితోషికం.
ప్రభాస్ రూ.100 కోట్ల నుంచి రూ.200. ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన కల్కి 2898 ఏడీకి ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్
అజిత్ కుమార్ రూ.105 కోట్ల నుంచి రూ.165 కోట్లు. తునివు సినిమాకు అందుకున్న పారితోషికం.
సల్మాన్ ఖాన్ రూ.100 కోట్ల నుంచి రూ.150. టైగర్ 3 సినిమాకు పొందిన పారితోషికం.
కమల్ హాసన్ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు. కొన్ని నెలల కిందట విడుదలైన భారతీయుడు 2కు అందుకున్న రెమ్యునరేషన్.
అక్షయ్ కుమార్ రూ.60 కోట్ల నుంచి రూ.145 కోట్లు. ఖేల్ ఖేల్ మే సినిమాకు పొందిన పారితోషికం.