Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..

Wed, 27 Nov 2024-7:11 pm,

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా  సుకుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన పుష్ప 2 షూటింగ్ ఎట్టకేలకు ఈ మంగళవారం పూర్తైయింది. దీంతో  చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

చివరి రోజు షూటింగ్ పూర్తైయింది. ఐదేళ్ల మూవీ ప్రయాణం ముగిసిందన్నారు. బాహుబలి తర్వాత అన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా పుష్ప రికార్డులకు ఎక్కింది.

ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. అంతేకాదు సుకుమార్ ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలనే తపన వల్ల ఈ చిత్ర షూటింగ్ లేట్ అయింది. ఇక పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సంచలనమే రేపింది. అటు చెన్నైలో జరిగిన వేడుక కూడా కన్నుల పండవగా జరిగింది.

2019 అక్టోబర్ 30న పూజా కార్యక్రమాలతో అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప’ ప్రయాణం మొదలైంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ముందుగా ఒకే సినిమాగా తెరకెక్కిన నిడివి ఎక్కువ కావడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

2021 డిసెంబర్ 17 న పుష్ప.. ది రైజ్ మూవీ విడుదలై బాక్సాఫీష్ దగ్గర సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు తొలిసారి అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా రికార్డు క్రియేట్ చేసారు. అటు దేవీశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.

అంతేకాదు ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ పుష్ప శ్వాగ్ కు ఫిదా అయ్యారు. సుకుమార్ టేకింగ్ కు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగులో నైజాంలో తప్ప మిగిలిన ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు. కానీ ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా దుమ్ము దులిపింది.

పుష్ప 2 సినిమాను తొలిభాగాన్ని మించి ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ ఎత్తున టికెట్ రేట్స్ పెంచనున్నట్టు సమాచారం. మొత్తంగా ఐదేళ్ల ప్రయాణం నేటితో ముగయడం విశేషం. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు  విజయం సాధిస్తుందనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link