Anchor Sreemukhi: థాయిలాండ్‌లో యాంకర్ శ్రీముఖి సందడి.. బర్త్ డే ట్రిప్‌లో రాములమ్మ
థాయిలాండ్‌లోని ఫుకెట్ నగరంలోని ఫేమస్ జూను శ్రీముఖి సందర్శించింది. డిఫరెంట్ పోజుల్లో పిక్స్ దిగుతూ సందడి చేసింది.
ప్రస్తుతం చేతినిండా షోలతో శ్రీముఖి బిజీగా ఉంది. ఆ ఛానెల్.. ఈ ఛానెల్ అనే తేడా లేకుండా ఎక్కడ అవకాశం వచ్చినా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.
పటాస్ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. తన మాటతీరుతో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది.
బిగ్‌బాస్ సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరించింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చివరి వరకు టైటిల్ కోసం పోటీ పడి రన్నరప్‌గా నిలిచింది.
మరోవైపు వెండితెరపై కూడా మెరుస్తోంది శ్రీముఖి. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో శ్రీముఖికి మంచి రోల్ దక్కినట్లు సమాచారం.