CM Chandrababu naidu: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కారు.. ఆ మంత్రికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం..
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు టీడీపీ, జనసేన, కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రజలు తమకు న్యాయం చేస్తారని భావించి కూటమిని ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఇటీవల కేసర పల్లిలో ప్రమాణ స్వీకారం చేశారు. 24 మందిని మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక ఆయా మంత్రులకు కూడా ఈరోజు ( శుక్రవారం) శాఖలను కూడా కేటాయించారు. ఇక పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు, నారా లోకేష్ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు, అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ నాదెండ్ల మనోహర్ : ఆహారం, పౌరసరఫరాల శాఖ, వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖలను కేటాయించారు.
టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించిన చంద్రబాబు నాయుడు.. ఆయనకు సచివాలయం, గ్రామ వాలంటీర్ బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో ఏపీ సర్కారు వాలంటీర్లకు పరోక్షంగా శుభవార్త అందించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ కంటీన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే పదివేలు జీతంగా ఇస్తామని ప్రచారం చేశారు. చంద్రబాబు.. చెప్పిన విధంగానే వాలంటీర్ ల కోసం ఒక మంత్రిని కేటాయించడంతో వారంతా ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎన్నికల సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కారణమంటూ ఇటీవల మాజీ మంత్రులు సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారంతా తమ జాబ్ లు ఉంటాయా.. ఊడతాయా.. అంటూ తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.
ఈ క్రమంలో చంద్రబాబు వాలంటీర్ ల కోసం ప్రత్యేకంగా మంత్రిని కేటాయించడంతో, వాలంటీర్లను ఏపీలో తిరిగి కొనసాగిస్తారని విషయం స్పష్టమౌతుంది. ఇక చంద్రబాబు నాయుడు సచివాలయం, గ్రామ వాలంటీర్ పేరిట ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి.. ఈ బాధ్యతలను డోల బాల వీరాంజనేయ స్వామికి కేటాయించడం విశేషంగా చెప్పుకొవచ్చు.