Andhra Pradesh Formation Day: ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం జరిగిన 64వ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Y. S. Jaganmohan Reddy ) ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత సీఎం జగన్ తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు.
ఆ తర్వాత క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, తదితరులు పాల్గొన్నారు.